పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

ఆమెరికాసంయుక్త రాష్ట్రములు


చేసి ముప్పది వేల ప్రజలను కరువులోను భిక్షకవృత్తిలోను. కూలడోసినారు. " "హేతువాదనలోను, దూరదృష్టిలోను, న్యాయబుద్ధిలోను, ముఖ్యముగ నిట్టి విషమదశలో, ఏజాతికిని ఏసంఘమునకును ఫిలడల్ఫియాలో జరిగిన అమెరికనుల సమావేశము తీసిపోనేరదని నేను స్పష్టముగ తెలియ చేయుచున్నాసు. అట్టి వారిమీద బానిసత్వమును విధించుటకును, బలవంతు లగు జాతిమీద నిరంకుశత్వమును స్థాపించుటకును మీరు చేయు ప్రయత్నములన్నియు విఫలములగుట నిశ్చయము. చిట్టచివరకు మనమే లోబడవలసి వచ్చును. మనము "వెనుకకు మరలి తీరవలసి వచ్చినప్పుడుగాక బుద్ధిపూశ్యకముగ వెనుకకు మరల గల స్థితిలో నున్నపుడే వెనకకు మరలుట యుక్తము " అని ఆయన గంభీరోపన్యాసము చేసెను. కాని పార్లమెంటు సభ్యులు హితబోధలను లక్ష్యము చేయలేదు, బాస్టను పట్ట ణముషండి యాంగ్లేయ సైన్యములు తీసివేయ వలెననియు అమెరికనులతో రాజీపడవలెననియు నాయన యుపపాదించిన తీర్మాసము లోడిపోము . అమెరికా వర్తకముసుగూర్చి పార్లమెంటువార పలంబించిన పద్దతులలో మార్పుకలుగుటా. వశ్యకమని లండను వర్తకులు పెట్టిన అర్జీలను నొక యువనంఘమునకు తోసి వేసిరి.

{వలస రాష్ట్రములలో
ఐక్యత

ప్రధానమంత్రి నార్తు ప్రభువు వలసరాష్ట్రము లను చీలదీయవ లెవని ప్రయత్నించెను, ఏరాష్ట్రమ యినను ఆంగ్లేయ యుద్యోగస్తులకు నిర్ణయము మైనజీతములిచ్చుటకును సైనికుల ఖర్చులు భరించుటకును తన ప్రతినిధిసభలోనే తీర్మానించుకొన్న యెడల