పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిదవ ఆధ్యాయము

81


.. యువన్యాసములో చెప్పెను. ప్రభువుల సభవారు మెసషు - ట్సు రాష్ట్ర ప్రజలు చూపుచున్న చట్టధిక్కారమునకును తిరుగ చాటునకును తమ యాగ్రహమును 'అసహ్యమును వెలిబుచ్చు చు వీరిని తగువిధముగ శిక్షించ నిశ్చయించినందుసకు రాజునకు కృతజ్ఞతను తెలిపిరి. ప్రజా ప్రతినిధి సభవారు నిటులనే తీర్మా నించిరి. కానీ విలియం పిట్టు మాత్ర మీదినమున పార్ల మెంటు సభకు వచ్చి అమెరికా ప్రజలతో నెటులయిన సంధి గావింప వలెననియు బోస్టసునుండి పటాలములను తీసి వేయ వలెననియు వాదించెను. " ఆమెరికావారు చేసిన అక్రమ చర్యలను హర్షించమని నేను కోరుట లేదు. వారికి న్యాయము కలుగ చేయవలెనని మాత్రమే నేను కోరుచున్నాను. మీచర్యలను ఎదిరించుట వారి కనసరమును న్యాయమును నై యున్నది. నిరంకుశత్వమును ప్రత్యేళవ్యక్తు లవంభంచినను లేక సంఘము లవలంబి..చినసు నిరంగుశ చర్యలకు బ్రిటిషు పౌరులెవరును లోబడి యూరుకొన నేరరు. పార్లమెంటు సర్వాధికారి ' యని మీరుచేయు వృధాప్రకటనములును. వారు మీకు పాదా క్రాంతులయి తీరవలెనను పిచ్చి సిద్దాంతములును, మీతోడి పౌరులగు అమెరికనుల నమ్మక ములను మార్చుటగాని వారిని మీకు దాసులను చేయుటగాని నొనరించజాలవు. స్వాతం త్యముకొరకు నిలుపబడియున్న ప్రజల మీద ఆధర్మ యుద్ధము చేసి వారి రక్తమును చిందించునట్టి వారికి ఈశ్వర శాపము తగులును. బాస్టసుప్రజలను విచారించకుండగనే మీరు వారికి శిక్ష విధించి నారు. దోషులను నిర్ధోషులను కలిపి తారతమ్యము లేక శిక్షించి నారు. వారి రేవులో పెట్టి వర్తక ' ను జరుగను