పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ అధ్యాయము


డములో చాలమంది తలచుచున్నప్పటికిని అమెరికా ప్రజలింకను తాము స్వతంత్రమునకై యత్నించుచున్నామని తలుచలేదు. ఇంకను తాము ఆంగ్లేయు ప్రభుత్వ ల నుండి చీలిపో వలెనని కోరుట లేదని 1774 సంవత్సరం అక్టోబరు నెలలోనే జార్జి వాషింగ్ట నొక స్నేహితునికి వాసెను. "ప్రతి స్వేచ్చయుతమగు రాష్ట్రము యొక్కయు సౌఖ్యమున త్యావశ్వర మగునట్టియు, ఆస్తి, స్వాతంత్ర్యము, ప్రాణములను సంరక్షణ చేయునట్టియు, విలువగల హక్కుల నష్టముపకు మాత్రమే వలస రాష్ట్రము సహించ నేరదనియు, ఆంగ్లేయ మంత్రి వర్గము వారు మార్గపు పట్టుదలను బూసినచో ఉత్తర అమెరికాలో యిదివరక్కెన్నడును చూడని విధమున రక్త ప్రవాహములు జరుగుననియు నాయన వ్రాసెను.

{మెసషుసెట్సు ప్రజా
ప్రతినిధి సభ ధైర్యము.

ఇక్కాలమున 'మెసషు సెట్సు రాష్ట్రము ధైర్యము :తో ముందు నడచుచున్నది. అక్టోబరు 5వ తేదీన ప్రపతిధి సభ కూడవలసి యున్నది. ప్రధమహక్కుల శాసనము ప్రకారము కార్యనిర్వాహక వర్గమును ప్రజాప్రతినిధి సభవారే ఎన్నుకొనవలెను గాని ఈమధ్య బ్రిటీషు పార్ల మెంటు వారి హక్కును దీసి వేసి గవర్నరే కార్యనిర్వాహక వర్గమును నియమించ వలెనని శాసించిరి. దీని ననుసరించి గవర్నరు కార్యనిర్వాహక సభ్యులను నియమించెను, కాని మూడవ వంతు సభ్యులు తమ పదవులను గ్రహించుట కంగీకరించలేదు. మిగిలిన వారు ప్రజలకు భయపడి రాజీనామాల నిచ్చి, గనర్నరు నిగమించిన న్యాయాధిపతు లుద్యోగము చేయలేదు