పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికా సంయుక్తరాష్ట్రములు


ఏరాష్ట్రములోను శాంతి సమయములో ఆ రాష్ట్ర ప్రతినిధినభయొక్క అనుమతి లేనిది ఆంగ్లేయ సైనికుల నుంచగూడదు"అని ప్రకటించిరి. పంచదార చట్టము స్టాంపుల చట్టము సైన్యములు - నుంచుచట్టము తేయంకుచట్టము బోస్టను రేపు చట్టము అమెరికాలో చేయబడిన నేరములకు ఆంగ్ల దేశములో విచారణ - చేయు చట్టము మోసషు సెట్సు క్విచెకు న్యూ యార్కు రాష్ట్ర ములను గూర్చి చేసిన చట్టములు మొద లగునవన్నియు వలస ప్రజల హక్కులకు భంగకరముగ చేయబడినవని తీర్మానించి. ఆంగ్లేయ దేశమునుండి వచ్చు సరుకులను కొనగూడదనియూ తీర్మానించిరి. గ్రేటుబ్రిటనులోని 'ప్రజలు తమ హక్కులనుగూర్చి యాందోళనము చేయవలెననియు ఆమెరికా ప్రజలందరిలోను నీ తీర్మానములను వ్యా పింప చేయవలెననియు తమ రాజునకొక రాజభక్తితో గూడిన మసవిని పంపవలెననియు, నిశ్చయించిరి. పార్లమెంటు వారి చట్టముల నన్నిటిని మెసష సెట్సు రాష్ట్ర మువారు తిరస్కరించుట కామోదమును చూపి, మెసషు సెట్సు ప్రజలు ఇబ్బందులు కలిగిన యెడల అమెరికా వారందరును వారికి తోడ్పడవలె పని తీర్మానించిరి. వలసరాష్ట్రముల సంఘములో చేరవల సినదని కనడా ప్రజల నాహ్వానించిరి.ఏబది యొక్క దినములు సమావేశమై పై తీర్మాగము లన్నియును చేసి అమెరికా దేశీయ మహాజనసభ ముగిసెను. తిరిగి దేశీయ మహాసభ 1775 సంవత్సరము మే 10వ తేదీన సమావేశ మగుటకు నిర్నయమయ్యెను. ఇగ్లాండుచేయు చట్టములను ధిక్కరించి ప్రవర్తించుట స్వతంత్రమును కోరుట యేయని యూరఫుఖం