పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

అయిదవ అధ్యాయము


మొదలగువారు తీవ్రమగు నుపన్యాసముల నిచ్చిరి. సాయంత్రము సభ ముగియగానే ప్రజ" గుంపులు గుంపులుగ సముద్రతీరమునకు పోయిరి. ఈప్రజలు చూచి కోలాహలము చేయు చుండగ ఎర్రయిండియను వేషములను ధరించిన బదిమంది అమరికనులు తేమూకుపడవలలోనికి పోయి వాటిలోనున్న 842 పెట్టెల తేయాకును సముద్రము లొ పడదోసి, వచ్చిరి. ఒక నెలతరువాత నా ఆంగ్లేయ యుద్యోగస్తునికిమొగమునిఁడ సల్ల తారుబూసి తల మీద యీకలు ధరింపజేసి. బాస్టసువీధులలో గుండ ప్రజలూ రేగించిరి. బాస్టన్ లోని పత్రికలు అమెరికా రాష్ట్రములన్నియు కలిసి యొక మానవ హక్కుల ప్రకటనమును గావింపవలెనని లేనిచో ప్రజాస్వా మ్యమును స్థాపింపవలెననియు వ్రాయుచుండెను.

{ఆంగ్లేయ పార్లమెంటు
వారియాగ్రహము}

ఈసంగతులు తెలిసి బిటిషుపార్లమెంటులో చాల నాగ్రహము గలిగెను. ఇంగ్లాండులో సమెరికాతరఫున ప్రతినిధిగ పనిచేయుచున్న బెంజటమిను ఫ్రాంక్లిన్ ను" ఆంగ్లేయ పొర్ల ఖయిదుచేయుదురను వాడుకలు పుట్టెను.గవర్నరును మార్చ వలసినదని మెసషుసెట్ను ప్రతినిధి సభ పక్షమున నాయన ప్రీప్ కౌన్సిలులో దాఖలు చేసిన అర్జీని విచారించకుండగనే తోసివేచిరి. బాస్టను రేవులోనికి నెట్టి సరుకులు పడవలును రాగూడదని షేధించుచు నొక చట్టమును చేసిరి. దీనివలన బాస్టనుల యొక్క వర్తకమునంతను నాశనము చేయ నిశ్చయించిరి. మెసషునెట్సు రాష్ట్రమున సొంగ్లేయ సైనికులుగానీ అధికారులు గాని శాంతిని స్థాపించు నపుడును తమ విధులను నెరవేర్చు.