పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

అమెరికా సంయుక్త రాష్ట్రములు


(5)

{ఆంగ్ల నౌకను
తగులబెట్టుట}

1772 సంవత్సరమున తిరిగి కలతలు ప్రారంభమయ్యెను. ఉత్తర కారొలీనా రాష్ట్రములోని ప్రజాస్వామిక వాదుల సణచివేయుట కాంగ్లేయ అధి కారులు ప్రయత్నించినందున వారు టెనెన్సీసది , పొంతములకు లేచిపోయి ఆంగ్లేకు సంబంధము లేని యొక స్వతంతమగు చిన్న ప్రజాస్వామ్యను స్థాపించు కొనిరి. ఆమెరిగా రాష్ట్రముల ప్రజలు పరాసుతత్వ శాస్త్రజ్ఞు లగు వాల్టెరు రూసో మొదలగువారు స్వతంత్రమును గూర్చియు, ప్రజాస్వామిక మును గూర్చియు, మానవసమానర్యమును గూర్చి , వ్రాసియుస్న గ్రంథములసు చదుపు చుండినందున స్వంత్రభావములు పూర్తిగా నాటుకొనుచుండెను.యుద్ద నౌకలనుగాని యుద్ధ సౌమానునుగాని సైనికుల యాహార పదార్తములను యుద్దపూర్వముగ తగులబెట్టిన వారికి మరణదండన వధించబడునని యొక శాసనము నాంగ్లేయ ప్రభుత్వం చేసియుండెను. రోడు అయిలండురాష్ట్రము లోనికి దొంగతనముగ ఏ దేశములనుండి తేయాకును తెప్పించు కొనుచున్నందున నట్టి దొంగతనము నాపుటకై ప్రొవిడ స్సను రేవులో నొక యాంగ్లేయ నౌక యుంచబడెను. దానిని అర్ధరాత్రి వేళ పట్టుకొని ప్రజలు తగులబెట్టిరి.(1762 సంవ త్సరం జూన్ 9 తేదీ). ఈ నేరము నెవరు చేసినదియు తెలి పినవానికి అయిదువుదల సవరముల నిచ్చెద మని ఆంగ్లేయ, ప్రభు త్వము వారు ప్రకటించినప్పటికీ ఎవరును సమాచారము తెలు పలేదు.ఏమియు సాక్ష్యము లేక ఆంగ్ల ప్రభుత్వమువారూరుకొనిరి.