పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ అధ్యాయము

69


తానే ఆంగ్లేయ, ప్రభుత్వమువారి యుత్తరువుల ననుసరించి రాష్ట్ర పాలనను జరి పెదననెను. - వెంటనే ప్రజలు ఎన్నికలు జరిపి నూతన ప్రజాప్రతినిధినభను సమావేశ వరచుకొనిరి. ఆరాష్ట్రములోని ప్రతి భాగమునుండియు ప్రతినిధులు వచ్చిరి. గవర్నరీ సమావేశమును విడిపోవలసినదని యాజ్ఞాపించినను ప్రజాప్రతినిధి సమావేశము విచ్చిన్న మగుటకు నిరాకరించి రాష్ట్ర ప్రభుత్వమును గూర్చిన యావత్తుచట్టములను తీన్మాన ములు చేయసాగెను. ప్రభుత్వ న్యాయవాదియగు డి గ్రేసును తామిట్లుచేయుటవలన రాజద్రోహము క్రిందకు వచ్చెదమా యని సంప్రదించగా స్పష్టముగారాకపోయినను రాజద్రోహ నేరమున కొక వెంట్రుక వాసి సమీపం లో నున్నారని చెప్పెను.

{ఆంగ్లేయ సైన్యములు
ముట్టడించెను}

ఇంతలో వలసరాష్ట్రములలో స్థిరముగ నాంగ్లేయసైన్యముల నుంచెదరను సమాచారము తెలిసెను. 1768 సంవత్సరం సెప్టెంబరు 28 వ తేదీన ఆంగ్ల ప్రభుత్వము వారి ఏడు యుద్ధ సౌకలు బౌస్టన్ రేవులోనికి వచ్చెను. వానిలో నేడువందల మంది అగ్లేయ సైనికు లుండిరి. అక్టోబరు 11వ తేదీన నీ సైని కలు పడవలో నుండి దిగి పట్టణములోనికి రాగా అందరును బసలిచ్చుటకు నిరాకరించిరి. బవంతముగ కొన్ని గృహము లను స్వాధీనపరచుకొని వానిలో సైనికులు దించిరి. ఇంకను సైన్యములు రాసాగెను. ఒక సంవత్సరము లోపల షుమారు నాలుగు వేలమంది యాంగ్లేయ సైనికులు బాస్టన పట్టణమున నుండిరి. 1769 సంవత్సరమున రాష్ట్రీయ ప్రతి