పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

అమెరికా సంయుక్త రాష్ట్రములు


సభలో చేయబడిన తీర్మానములవంటి తీర్మానములనే న్యూ, యార్కు, మనషు నెట్సు, మొదలగు రాష్ట్రములచే కూడ చేయబడినవి

{స్టాంపు చట్ట బహిష్కారము}

స్టాంపుచట్టము నవంబకు నెలలో అమలులోనికి తేబడసున్నది. కావున మనషరాసెట్సు ప్రతినిధిసభ .వారు అక్టోబరులో న్యూ యార్కుర్కు పట్టణమున బహిష్కారము నొకక(కాంగ్రెసును) దేశీయ మహాసభ జరుగు నట్లేర్పాటుచేసిరి.కొంతకాల మాలోచించి మెసషు స్వ్ట్సు వారి యాహ్వానమును దక్షిణ కారొలీనా రాష్ట్ర ప్రతినిధి సభ వారంగీకరించిరి, శీఘ్రకాలములో తక్కిన రాష్ట్రములును దేశీయ మహాసభకు వచ్చుటకు సమ్మతించెను ఈ లోపున ప్రజలలో నాందోళనము వ్యాపించెను. ఆగస్టు నెలలోనే బాస్టను పట్టణ ప్రజలు ఆంగ్లేయ తంత్రి బూటుప్రభువు యొక్క యు బాస్టసులోని స్టాంపులనమ్ముట కేర్పడిన ఆవవరు యొక్కయు బొమ్మలనుచేసి పగలంతయు వ్రేలాడదీసి రాత్రి వేళ కాగడాల వెలుతురుతో ఆబొమ్మలను శవము లవలేమోసు కొని "స్వాతంత్ర్యము ఆస్తికావలెను. స్టాంపులు కూడదు” అని కేకలు వేయుచు వీధుల వెంట నూరేగించి జనుల గుంపలు సంతోషము కోలాహలము చేయు చుండగ తగుల బెట్టిరి. అప్పుడు కట్టబడుచున్న స్టాంపుల కచ్చేరి మీదపడి కూలద్రోసి నేలమట్టము గావించి సామానులను తగుల బెట్టిరి. ఆలిపేరు యొక్క ఇంటి కిటికీలను బ్రద్దలు కొట్టిరి. ఆలివరు కొద్ది దిన ములలో తన ఈద్యోగమునకు రాజీ నామా నిచ్చెనని ప్రకటించెను. కొలది దినములలో నే ప్రజ, అల్లరులు జరిపి