పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

అమెరికా సంయుక్త రాష్ట్రములు


చేసిరి. వెనుకటి యోడవర్తకపు శాసనములన్నియుతిరిగి అమ లులో బెట్టిరి. ఆసియా ఖండమునుండియు ఆఫ్రికా ఖండము నుండియు బియ్యము, పంచదార మాత్రము. తెప్పించుకోన వచ్చుననియు తక్కిన ఏవిధమయిన వర్తకమును ఆంగ్లేయ దేశ ముతో తప్ప మరియే దేశముతోను చేయకూడదనియు శాసించిరి. ఈ రాష్ట్రములోనికి దిగుమతి యగు సారాయముల మీదను పంచదార మీదను సు:కము ను విధించి. వీరి గలప వర్తకమసకు పెక్కు ఆటంకములను కలుగ జేసిరి. దీని వలన నీవలస రాష్ట్రములు ప్రజలలో మితిలేని యసంతృప్తి కలిగెను. మాతృదేశము నాకు తమవర్తకాభివృద్ధి కభ్యంతరము కలుగచేయు చున్నారనియు, తమ యిష్టమును వ్యతిరేకముగ తమమీద పన్నులు విధించుచున్నారనియు, సక్రమమగుచట్టము లసు తమమీద చేయి చున్నా రనియు, వలస రాష్ట్రులవారు మాతృదేశ ముమీద నేరా రోపణ చేయుచుండి. పలసరాష్ట్ర ముల ప్రజలు పొగరుబోతులుగను కృతఘ్నులు గను తుంటరు లగ సున్నారనియు, మాతృదేశము యొక్క సంరక్షణ క్రింద వృద్ధి చెంది ఇపుడు తమసంరక్షకుని కూలదోచుటకు సిద్ధముగ నున్నారయు నాంగ్లేయ ప్రభుత్వము వారు చెప్పుచుండిరి. ఉభయుల మధ్య మనస్పర్ధలు హెచ్చుచుండెను.

{బలవంతమగు
సైనిక కొలువు

కలతకు మరియొక కారణము కలిగెను. ఆంగ్లేయయుద్ధ నౌకలు వలసరాష్ట్ర, తీరములకు వచ్చి నపుడు ఆగ్లేయ నౌకాసేనాధిపతులు మనుష్యులవసరమయిన చో వలస ప్రజలను బలవం తముగా తీసుకొనిపోయి తమ కొలువులో చేర్చుకొనుచుండిరి.