పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

అమెరికా సంయుక్త రాష్ట్రములు


సంఘములు తీసివేయాబడెను. మూడునంవత్సరముల కాలము వరికీ నిరంకుశ ప్రభుత్వమున రాష్ట్రములన్నియు లోబడెను. న్యూయార్కు రాష్ట్ర ప్రజలు కలహించి యొక యొకె ప్రతినిధిసభను నొక గవర్నరును (రాష్ట్ర పాలకుని) ఎన్నుకొనిరి. కాని వీరెన్నుకొనిన రాష్ట్ర పాలకుని ఆంగ్లేయప్రభుత్వమువారు రాజ ద్రోహ నేరము కింద పట్టుకొని విచారించి యురితీసి ప్రజా ప్రభుత్వమును విచ్చేదము చేసిరి. ఈయనను ప్రజాస్వాతంత్ర్య ముకొరకు ప్రాణములర్పించిన ధీరునిగ ప్రజలు గౌరవించి ఆయన వస్త్రపు ముక్కలను జ్ఞాపకమునకై దాచుకొనిరి. ఈకలతలో వలసరాష్ట్రములు లోబడి నను దీనిలోను రాబోవు స్వాతంత్ర్య యుద్దములోను నిమిడియున్న సిద్ధాంతము లొకటే. మాత్స దేశము వలసరాష్ట్రముల ప్రభు త్వముతోను వారి వర్తతకపు స్వేచ్చతోను జోక్యము కలుగజేసుకొనవచ్చునా కూడదాయను విషయమే ముఖ్యమైనదిగ నున్నది.


1688 సంవత్సరమున నాంగ్లేయ దేశములో విప్లవము జరిగి రెండవ జేమ్సు రాజు ను దేశ భ్రష్టుని చేసి విలియం రాజును మేరీరాణిని పాలకులను చేసికొనిరి. ఈసమయమున నీవలన రాష్ట్రములు తిరుగ బాటుచేసి తమ రాష్ట్ర పాలకుడగు సర్ ఎక్మంతు ఆండ్రాననును వెడలగొట్టి ప్రజాప్రతినిధి సభలను స్థాపించుకొని విలియం రాజుకును మేరీ రాణికిని తమ రాజభక్తిని ప్రకటించినవి. ఆంగ్లేయు దేశములోని ప్రభుత్వం తొందరల వలన వారు చూచిచూడనట్లూరకొనిరి. మరి యొక గవర్నరును పంపిరి, మెగషు సెట్సు రాష్ట్రము వారు హక్కుల దాన శాసనమును తిరి గిమ్మని కోరినపుడు ఆంగ్లేయు ప్రభుత్వ మువారు