పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

అమెరికా సంయుక్త రాష్ట్రములు


రాష్ట్రపు ఆంగ్లేయ ప్రభుత్వ మువారు ప్రతి యెర్రయిండియనును వుర్రెకును నూరు షిల్లింగులు చొప్పున బహుమాన మిచ్చెద మని ప్రకటింపగ నారాష్ట్రములోని ఆంగ్లేయుల జట్టొకటి బయలు దేరివచ్చి యూగ్రామముమీద పడి దోచుకొని తగుల బెట్టి క్రైస్తవ దేవాలయమును మంటల కాహుతిచేసి ఎర్ర యిండియములను చంపి పుర్రెలు తీసుకొని పోవుటయే గాక యామతగురువుకు శరీరములో ననేక పోటులు పొడిచియు తల పగులగొట్టియు క్రూరముగ హత్య గావించి నోటిలోను కండ్లలోను మట్టిగొట్టి పోయిరి.


సంయుక్త రాష్ట్రములలో 1768 వ సంవత్సరమువరకు ఎర్రయిండియసులు మిస్సిసిపీనదీ ముఖ ప్రాంతమునను 'సెంటు లారెన్సుల కిరు ప్రక్కలను టెనెస్సీలోయలోను, ఎరీ, హ్యూరన్, సరస్సుల పక్కలను ఇకను మిగిలియున్నారు. తక్కినవారు నాశనమయి నారు. 1768 కు తరువాత నీ ప్రాంతములన్నియు తెల్ల జాతులచే నాక్రమింపబడి ఎర్రయిండియనుల దృశ్యులై పోయిరి.