పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43

నాల్గవ ఆద్యాయము

లోనే ఒడంబడికలు, షరతులు, చెడిపోయి కలతలు ప్రారంభ మయ్యెను. దాదాపుగా యెల్లప్పుడును ముందు తెల్లవారే కయ్యమునకు కాలుత్రవ్విరి. ఉభయజాతులవారు నొకరి నొకరు నరకకొనిరి. ఉభయుల మధ్య యుద్ధము జరిగెను. త్వరితముగనే తెల్లవారికి బయము కలిగెను. చా వగమిగిలిన మెర్ర యిండియనులు కొత్త యెంబడికలు చేసికొనిరి. వీటి యందు యెయిండియనులకు సంపూర్ణమగు ద్వేషమేయండెను. వీటి యర్ధమును యెర్రయిండియనులకు కొంచము: గనే తెలిసెను. ఏర్రయిండియనుల దేశమునంతను తెల్లవా రాక్రమించి సముద్ర తీరము వరకును యచటనే వేసి కొద్ది ప్రదేశమును మాత్రమే ఎర్రయిండియనులు కాపురముండుటకు వదలిరి. ముందిక్కడ యెర్రయిండియనులు విధిలేక ప్రవేశించి కొద్దికాలములోనే తెల్లవారి పై తిరుగుబాటు చేసిరి'. ఈతిరుగుబాటులో తెల్లవారిచే యెర్రయిండియనులు చాల వరకు నశించుటయు చావగ మిగిలినవారు బానిసలగుటయు తటస్థించెను. కాని కొన్ని చోట్ల వివిధ జాతుల తెల్లవారు సమీపములో కాపురముండి ఒకరితోనొకరు కలహించుకొను చున్నపుడు మాత్రము తెల్లవారు ఎర్రయిండి యనుల గౌరవముగ చూచి వారి సహాయమునపేక్షించి ఉభయకక్షలవారును వారిసహాయము కోరగ కొందరొక పై పువను కొందరు మరియొక వైపునను చేరుటతటస్థించెను. తెల్లవారు తమ శత్రువులుగ తెల్లవారిమీదను వారితో చేరేడు యెర్రవారి మీదను తమతో చేరిన ఎర్రవారి సుపయోగించిరి. ఈయుద్ద ములలో నీయెర్రవారు చాల మంది మరణించి వీరిజూతులుబల