పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ఆమెరికాసంయుక్త రాష్ట్రములు


వారినమ్మకము. కొందరు దున్నపోతు, ఎలుగుగొడ్డు మొదలగు జంతువులను పూజించుచుండిరి. కొందరు సృష్టిలోని శక్తుల నారాధించుచుండి , సృష్టినంతను చేసిన దొక్క యీశ్వరుడే యన నమ్మకము కూడ వారిలో చాల మందికుండెను. వారాధించు దేవతలకు మనుష్యులను బలియిచ్చుచుండి. ఒక మనుష్యుని నెపరైన హత్యకావించిన యెడల, హంతకుల చంపి పగసాధించు విధి యాతని వారసుల కుండెను. స్నేహము చేసిన యెడల మిక్కిలి విశ్వాసపాత్రులుగను, విరోధము సంభమిచినచో మిగుల క్రూరముగ పగతీర్చుకొనువారుగను నుండిరి. సాధ్యమగు సంతవరకు శతృవుతో నిలచి యుద్ధముచేయుటయు, తప్పించు గొని అకస్మాత్తుగ శతృ మాద పడి చంపి యూత: శిరస్సును ఖ-డించి తీసికొనిపోవుట యను, వారి యలవాటు. ఆ శ్తృవుల స్త్రీలను పిల్లలను పట్టుకొని బానిసలుగ చేయుటము అట్లు చేయుటకు వీలుగానిచో చంపివేయుటయు వారి యాచారము, మరణమునందు నిర్లక్ష్యమును ఆత్మ యొక్క శాశ్వత తత్వము నందు నిశ్చయమైన సమ్మక మును, మిత మైన జీవితమును విశ్వాస పొత్రమగు ప్రవర్తనయు వారి ల్క్షణములు. మరణించిన తరువాత వారు పొందెడు స్వర్గము లో అందమైన యడవులు ఫలవంతమగు వృక్షములు, మంచి 'వేటాడు స్తలములు, ఎల్ల ప్పుడును స్ఫటిక జలములలో ప్రవహించునదులు నుండుననియు అక్కడ తమ్ము నాశనము చేయుచున్న తెల్లజాతుల వారుండ రనియు వారి నమ్మకము " అని జోకినుమిల్లరను గ్రంధకర్త వ్రాసియున్నారు. చాలజూతులవారికి కుక్క తప్ప మరియేయితర