పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ అధ్యాయము

39


దినుసులుగనున్న మొక్కజొన్న, పొగాకు, ఈ రెండుసు ఇది వరకే ఎర్రయిండియనులు పండించుచున్నవే, లోహములు వాడుట తెలియక పోయినను వారు పడవలను గృహములను కట్టుకొనుచుండిరి. రాతిగొడ్డలులను కొడవళ్ళను ఉలులను ఉపయోగించిరి. చలికాలమునకై ఫలములను 'మొక్కజొన్నలను, ఎండ బెట్టిన దున్నపోతు మాంసమును పొగచూరబెట్టిన చేపలను కూడ కొట్టి చాచుకొనుచుండిరి. చాపలను, బుట్టలను, జాలరులను, చెప్పులను, జనుము నుండి దారమును, ఊనిన తోళ్ళము, మట్టితో పాత్రలను, తయారుచేయుచుండిరి. వారి భాషను , వాయనేర్చియుండిరి. దూరప్రయాణమునుచేయుచు ప్రయాణికుల కాతిథ్య మిచ్చుచుండి.. వీరనేకజాతులుగ విభ జించబడి 'పెద్ద పెద్ద రాజ్యముల నేర్పరచుకొని యుండిరి. కొన్ని జాతులవారు ప్రజాస్వామ్యములను మరికొన్ని జూతులవారు నిరంకుశ ప్రభుత్వములను కలిగియుండిరి. దాదాపుగ అమె రికాఖండమంతయు నీజాతుల వశమందుండెను. నాటుచేజు హ్యూరన్ పేర్లుగల జూతులవారు తమ ప్రభువులు సూర్యవంశీ సంభూతులని సమ్ముచుండిరి. ప్రభువులు అధికారమును సంకు చిత పరచుటకు ప్రజలసభ కూడ నుండెను. ఈ ప్రజల సభలో యుక్తవయస్సు వచ్చిన అందరు ప్రజలుసు మాటలాడ నర్హులు. స్త్రీలు గృహకృత్యములన: చేయుటయేగాక భూములను దున్నుట, పైర్లను ప్రోగుచేయుట మొదలగు వ్యవసాయపు పను లను గూడ చేయుచుండిరి. పురుషులు గృహములను, కోటను, పడవలను, యుద్దపరికరములను నిర్మించుచుండిరి. పతి జీవజంతువులోని ప్రాణమును శాశ్వతముగ నుండునని