పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికా సంయుక్త రాష్ట్రములు.

నాలుగవ అధ్యాయము

ఎర్ర యిండియనులు.


{ఎర్ర యిండియనుల స్థితి}


యూరపుజూతు లమెరికా సంయుక్త రాష్ట్ర మ లకు వచ్చు.సరికి అచట ఎర్ర ( తామ్రవర్లపు) ఇండి యనులు కాపురముండిరి. వీరుబొత్తుననాగరికులుగారు. వీరు పల్లెలను పట్టణములను స్థాపించుకొని స్థిరనివాసము గలిగి యుండిరి. ఇపుడిల్లినా యను రాష్ట్రమేర్పడిన ప్రదేశమున పూర్వమొక గ్రామమున నేడెనిది వేల మంది ఎర్రయిండియను. కాపురముండినని మంక పరామ మతబోధకును వ్రాసియున్నాడు. వీరు వేటాడి జీవించువారును స్థావరము లేక తిరుగుచునుండు వారును గాక భూములను. దున్నుకొని జీవించుచుండిరనియు బటాణీలు మొక్కజొన్న వీరి ముఖ్యమగు నాహారపదార్ధము లనియు బాంక్రాఫ్టు వ్రాసి యున్నాడు. వీరి ఇండ్లచుట్టును చిన్న చిన్న తోటలను వేసుకొనుచుండిరి. ఇపుడ మెరికా దేశమున ప్రధాన పంట