పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31


వాడు చెప్పెను. ఆరాత్రి వాడాంగ్లేయుల వద్దనుండెను. మరు నాడుదయమున కొన్ని బహుమానములను పొంది వాడేగెను, తరువాత కొద్దిరోజులకు మరి అయిదుగు రెర్రయిండియను "లతో కూడ వాడు వచ్చెను.. మార్చి 22 తేదీన వారాంగ్లేయు లను తమ ప్రభువగు మెస్ససోయిటు వద్దకు తీసికొనిపోయి స్నేహమును కుదిర్చిరి. మెస్ససోయిటుకు మరియొకజాతి ఎర్ర యిండియనులు విరోధులుగ నుండిరి. వారినుండి తనకు సహాయము చేయవలసినదని ఆంగ్లేయులను గోరెను. ఆంగ్లేయులు సమ్మతించిరి. ఈసంగతి రెండవజాతి , ప్రభువుకు తెలసి ఆంగ్లేయులతో యుద్ధము చేయుటకు వచ్చుచున్నానని గుర్తుగ బాణముల కట్టనుపంపెను. ఆంగ్లేయులలోని ముఖ్యుడు. తోలుసంచిలో కొంత మందుగుందు పెట్టిపంపెను. దీనికి భయపడి యీ రెం డవ ఎర్రయిండియను జాతివారి రాజు యుద్ధము చాలించుకొనెను. ఇంతలో మరిగొంద రాంగ్లేయు లచటికి వలసవచ్చిరి. వారివద్ద భోజనసామాగ్రి అయిపోయినందున భోజనమున , ఎర్రయిండి యనులతో న్నే హముచేసి కొన్ని రోజులకు వారినిదోచుకొనిరి. దానితో ఎర్రయిండియను లీ తెల్ల వారిని నాశనము చేయుటకై 'కుట్రపన్నిరి. కాని ఆంగ్లేయుల మిత్రుడగు ఎర్రయిండియనుప్రభువు మొస్ససోయిటు కుట్రసంగతి ఆ గ్లేయులకు తెలిపెను. కుట్రదార్ల ముఖ్యులొక యింటిలో నుండగ నాంగ్లేయులు వారిని ముట్టడి,చి హత్యగావించిరి. అప్రదేశమున నున్న ఎర్రయిండియనులందరును పారిపోయిరి. తరువాత కొందరు లోబడి ఆంగ్లేయులతో సంధిచేసికొనిరి.

ఆంగ్లేయులు పంటలు పండించి ధాన్యమును ఎర్ర