పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

ఆమెరికాసంయుక్త రాష్ట్రములు


1621 సంవత్సరము మార్చి నెలాఖరుడు అరువది మంది మాత్ర ము మిగిలియుండిరి. మరుసటివత్సరము క్రొత్తగా ముప్పది అయిదుగురు పచ్చిచేరిరి. కాని వారివద్ద బొత్తుగా నాహార పదార్దములు లేకుండెను. ఆరు నెలలవరకందరు నొంటిపూటనే భోజనముచేసిరి. 1623 సంవత్సరమున భగవదనుగ్రహము వలన వంట బాగుగా పండినది. ఇంతటినుండియు భోజనము నకు కొదువ లేదు. కానీ రాజు యొక్క దానశాసనము వారికి లభింప లేదు. వారికి యితర నరుకులు మిక్కిలి కష్టముమీదను ప్రియముగను సమకూరెను. వారాంగ్లేయ దేశమున కెగుమతి చేయువానిని ఆంగ్లేయ ప్రభుత్వమువారు జప్తు చేసిరి. కావున ఈ రాష్ట్రము విశేషకాలమువరకు వృద్ధి చెంద లేదు. పదిసంవ త్సరములతర్వాత వీరిసంఖ్య మూడువందలు మాత్రముండెను. కాని వచ్చినవారు ధీరత్వముతో నీప్రదేశమును వీడక యుండిరి. వీరికి ప్రధమమునుండియు ఎర్రిండియనులతో పోరాటములు కలుగుచుండెను. వీరిలో నొక జట్టు చుట్టుప్రదేశముల వెదకి చూచుచున్న సమయమున ఎచటనుండియో బాణములు తగిలెను. తరువాత 1624 సంవత్సరము మార్చి 15 వ తేదీవి ఒక ఎర్రయిండియసు అడవిలో నుండి వచ్చి వీరిలో కొందరితో కలసి " మీకు స్వాగతము” అని యింగ్లీషుభాషలో చెప్పెను. ఆంగ్లేయులు వానితో స్నేహముచేసిరి, అదివరకు హంటు అను పేరుగల తెల్ల వాడొకడు ఎర్రయిండియనులతో సఖ్యము చేసినట్లు కొన్ని రోజులు నటించి తరువాత నొకరోజున కొందరెర్రయిండియనులను తన పడవలోని కెక్కించుకొని తటాలున వారిని బానిసలుగ తీసికొని సముద్రము మీధ వెళ్ళిపోయినాడని