పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు

{న్యూ ఇంగ్లాండు,
మెసషుసెట్సు
కనెకేటికటు
న్యూహాంపుషైరు
రోడు అయిలండు
రాష్ట్రములు

ఈ రాష్ట్రములు అమెరికా జాతికి ముఖ్యముగు యునికి పట్టులు. ఆంగ్లేయ దేశములో ప్రభుత్వము స్థాపించబడిన - ప్రొజెస్టంటుకైస్తవ మత శాఖకు చెందని వారిని ' ఆంగ్లేయ రాజులు క్రూరముగ హి సించుచుండిరి. 1602 వ సంవత్సరమున కొందరాగ్లేయు లాబాధలుపడ లేక నింగ్లాండు నుండి పారిపోయి హాలెండు చేశములో శరణుజొచ్చిరి. గాని హాలెండు దేశపు శీతోష్ణ స్తితులు ఆచారములు వారికి సరిపడ లేదు. అందువలన అమెరికాలో వలసల నభివృద్ధి చేయుట కింగ్లాండులో నేర్పరచబడిన లండను సంఘమునకు తమ కమెరికా ఖండముస కొంతనివాస యోగ్యమగు గల మిప్పించమని దరఖాస్తు పెట్టుకొనిరి "మేమందరమును మత ప్రేమాపాలను లచే బంధించబడిన 'వారము, ఒకరిమేలు మరియొకరు చూడవలసినవారము. ఎంతదూరమైనను మత స్వేచ్చకొరకై పోవుటకు సిద్ధముగ నున్నాము,” అని దరఖాస్తులో వ్రాసికొనిరి. లండను సంఘ మీధీర బృందమునకొక దానపట్టానిచ్చెను. కాని పొపము కొంతకాలమువరకు ప్రయాణముచేయుటకు ద్రవ్యము పుట్టలేదు. కట్టుబట్టలతో నింగ్లాండు నుండి హాలెండుకు మన స్సాక్షి చెప్పిన చొప్పున వర్తించుటకై లేచిపోయియుండిరి. తుదకు లండను సంఘమునుండి యే వారు నిర్నయించిన కఠిన షరతులకెల్ల సమ్మతించి కొంత సొమ్మును సంపాదించిరి. రెండు పడవలను తెచ్చుకొనిరి. కాని ప్రయాణమయ్యే వేళకొళ పడవ యజ మాని మోసము చేసెను. 1620 వ సంవత్సరము