పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అధ్యాయము

25


-


. యిండియముల క్రిందనున్న అమెరికాలోని ప్రదేకములను ఆంగ్లేయులకు దానపట్టా నిచ్చుటెట్లని. ఇందుకు ప్రత్యుత్తర మేమునగా ఎర్రయిండియనులకు వారి దేశములో ఎట్టిహక్కులున్న వనిగాని తెల్లజాతులవారు అంగీకరించ లేదు. మరియొక "తెల్ల జాతి వారిచే నాక్రమింపబడని ప్రదేశములనన్నిటిని ఆక్రమిం చుకొనుటకును దాన మిచ్చుటకును తెల్లజాతులవారికి హక్కు గలదని తెల్లవారుతలచిరి.

{న్యూయార్కు}

1609 వ సంవత్సరమున డచ్చి (హాలండు) తూర్పు ఇండియూ కంపినీ వారు హడ్సను అను నతనిని అమెరికాకు బంపగ నాయన డెలవేము సముద్రమును హడ్స నునది ప్రాంతమును గుమ్మరివచ్చె ను. ఇప్పుడు న్యూయార్కు పట్టణమున్న ప్రదేశమునకు వచ్చి నప్పుడు హడ్సన్ అచటి ఎయిండియనులలోని ముఖ్యులకు త్రాగుటకు సారాయము వచ్చెను. వారిది వరకు సారాయము, తాగుట నెరుగరు. మొదట యొక్కడు మాత్రమే అను మానముతో త్రాగెను. త్రాగినవారు కొంతసేపు సోలి పిచ్చిమాటలాడి సొమ్మసిలి తిరిగి మంచిస్థితి వచ్చుటను జూచి ఎర్రయిండియనుల కాశ్చర్యము గలిగెను. చాలమంది త్రాగి జూచిరి. తెల్లవారి చేత విచిత్రమగుశక్తి గలదని తలంచిరి. " మనహట్పను" అనగా "తాగుడుస్థలము” అని యాస్థల మునకు ఎర్రయిండియసులు పేరిడిరి. యిండియనులతో . స్నేహముగ నుండిరి అప్పుడు హాలండు నుండి నౌకలువచ్చి ఎరయిండియనులవద్ద పక్షుల ఈకలు