పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము

17



హిందూస్తానీ భాషను తక్కిన వారు నేర్చుకొనవలసియున్నారు.కనడా యొక్క రాజ్యాంగ భాష ఆంగ్లే యభాష అయినది. కనడా దేశములో కొంతకాలము వరకు ప్రోటస్టంటులగు ఆంగ్లేయులకును రోమను కాథలిక్కు లగు పరాసువారిని కలతలు కలుగుచుండెను. ఆంగ్లేయ గాజ్యముమీద తిరుగబోటుకలిగెను. కాని బ్రిటిషు రాజ్యాంగ వేత్తలు కనడా దేశమునకు స్వరాజ్యమిచ్చినచో నీకలతలు నివారణయగుసని తలచి బ్రిటిషు సామాన్యంతర్నితమగు స్వరాజ్యమునిచ్చిరి. అప్పటినుండియు ఆంగ్లేయ పరాసు కలతలు నశించినవి. ఉభయజాతులును ఐకమత్యముకలిగి తమ మాతృదేశాభివృద్ధికై బాగుగ పని చేయుచున్నారు. దేశాభిమానము జాతీయ భావము సంపూర్ణముగ కలిగినవి. స్వరాజ్యము రాగానే తమ ప్రక్క దేశమగు అమెరికా సంయుక్త రాష్ట్రములతో బాటు తమ దేశమునుకూడ సభివృద్ధి చేయు బాధ్యత అందరిమీదను ఏడుటవలన అదివరకు గల సాంఘిక స్పర్ధలును అసూయలును మత వైషమ్యములను వదలి వై.చి యుబయ జాతులవారును జవాబుదారితో తమ దేశముయొక గొరపము కొరకు కృషి సలుపుచున్నారు. ఇప్పుడు కనడా దేశము ప్రపంచములోని తక్కినయన్ని స్వతంత్ర దేశములతో పొటు అభివృద్ధిని గౌరవమును కలిగియున్నది.

కనడా దేశమును ప్రెంచి వారు పోగొట్టుకొనిన తరువాత ప్రెంచిగ్వైనీయును కొన్ని ద్వీపములును తప్ప అమెరికా ఖం డమునందు ఫ్రెంచివారికి పేరువడసిన ప్రదేశము, లేవియు లేవు. ఆంగ్లేయులకు శనడా దేశమేగాక, యుత్తర అమెరికాలో న్యూ