పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు

మాత్రమే కాపురముండగ కనడాకు దక్షిణమువనున్న వలస ప్రాంతములలో నాంగ్లేయులు పదిలక్షలమంది కాపురముండిరి. ఈ ఆంగ్లేయ వలసరాష్ట్రముల వారుసు. ఇంగ్లాండునుండి వచ్చిన ఆంగ్లేయ సైనికులును కనడా దేశము నాక్రమించుటకై ఫ్రెంచివారి పై అప్పుడవుడు యుద్ధములు సలిపిరి. 1754 వ సంవత్సరములో జరిగిన యుద్దము వలన స్థితిగతులు మార లేదు. కాని 1767 మొదలు • 1768 వరకు యూరపులోను హిందూదేశములోను అమెరికాలోను ఆంగ్లేయులకును , పెంచి వారికిని జరిగిన ఏడుసంవత్సరముల యుద్ధములో ఆంగ్లేయులే గొప్పజయములను పొందిరి. ప్రపంచ రాజ్యమును ఫ్రెంచివారి నుండి ఆంగ్లేయులు లాగికొనిరి. 1763 వ సంవత్సరమున జరిగిన పారిసుసంధివలన హిందూదేశ సామాజ్యమును కనడా దేశమును ఫ్రెంచివారు ఆంగ్లేయులకు వదలి వేసిరి. కనడా దేశ మాంగ్లేయుల వశమయ్యెను. అదివరకు కనడా దేశమునకు వలసవచ్చియున్న పరాసువారును తరువాత కనడా కు కాపురమునకు వచ్చిన ఆంగ్లేయులును కలసి కనేడియను జాతివారయిరి. ఇటులనే హిందూ దేశమునకు మొదటి కాపురస్తులగు హిందువులును తరువాత కాపురమునకు వచ్చిన మహమ్మదీయులును పారసీకులురు కలిసి హైందవులయిరి. కనడా దేశమును తమ మాతృభూమిగ అచట కాపురమున్న ఆంగ్లేయులును పరాను వారును , ప్రేమించు చున్నారు. పరానువారు తక్కువ సంఖ్యాకులగుటచే విశేష సంఖ్యాకుల భాషయగు ఆంగ్లేయ భాషనుకూడ నేర్చుకొనిరి. హిందూ దేశములో కూడ విశేష సంఖ్యాకుల భాషయగు