పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

నీలగిరి,


చక్కని తెలుగు వార్తా పత్రిక.

ఇదినిజూము రాష్ట్రమునుండి మొట్టమొదలు వెలు వడిపండ్రెండు పుటలపై ముద్రింపబడి క్రమము 7 సడుపబడుచున్నది. ప్రతి గురువారమున బ్రకటింపబడును


ఇందువిమర్శనలు విదేశ వృత్తాంతములు, నిజము దేశ, వార్తలు వింతలు, వినోదములు, వ్యవసాయాభివృద్ధి కవసర మైన వ్యాసములు, వ్యవహారికవిషయములు, శ్రీ వారిఫర్మా షులు, హైకోర్టు తీర్పులు, కొత్తచట్టములు, పద్యములు, ప్రహసనములు, వైద్యవిధానములు, పరిశ్రామిక సంబంధములైన వ్యాసములు, పరిశోధక విషయములు, రూప పటములు, పాంఘిక సంస్కరణచర్చలు, నిజాము రాష్ట్రా ధోద్యమ మునుగూర్చిన సంగతులు, ప్రకటనలు. వేయేల- పపంచ మందు జరుగు వివిధాంశములును, మనయభివృద్ధి కవసరమైన నూతనవిషయములును ప్రకటింపబడుచున్నవి.

ప్రతి సంవత్సరమనేక రూపపటములతో సంవత్సరాది పంచాంగముతో వివిధ వ్యాసములతో, పద్యములతో, మూడు రంగుల ముఖపత్రముతో గూడుకొనిన " నీలగిరి: ఉగాది: సంచిక " , పకటింపబడుచున్నది.

సంవత్సరము చందా 4-8.0 మాత్రమే. స్థానికులకు నాలుగు రూపాయలు. విడి పత్రిక రెండు నాలు. బిటి ము! ప్రాం తములవారు ముందుగ మని ఆర్డరు వంశవ లెను. నీలగిరి కార్యస్థానము', నల్లగొండ (నిజాం)