పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము

15


లభ్యము కాలేదు. హాలెండుగారుసు (డచ్చివారు) బహు - కొద్దిగనే సంపాదించిరి. హాలెండువా రాక్రమించిన "న్యూ - ఆంస్టర్డాం ” 1674 వ సంవత్సరమున ఆంగ్లేయులవశమయ్యెను. దాని కాంగ్లేయులు • న్యూయార్క'ని పేరిడిరి. గ్వయ నాయును హాలెండువారాంగ్లేయుల కిచ్చిరి. పశ్చిమ యిండియా ద్వీపములలో డేసులు సంపాదించిన వాటిని కూడ నాం గ్లేయుల కిచ్చిరి. 4.

{కెనడా
దేశము}

ఆంగ్లేయులు ప్రధమ జేస్సు, మొదటి చార్లెసు, రెండవచార్లెసు, రాజులయొక్క నిరంకుశత్వ ముక్రీందను మత నిర్బంధములక్రిందను బాధలునొం దుటకూడ తటస్థించినందున తెలివిగల వారును ధైర్యశాలులుసగు పారసీకు లాంగ్లేయ దేశమునుండి బయలుదేరి యుత్తర అమిరికాకువచ్చి వలసనేర్పరచుకొనిరి. పరాసులుకూడవచ్చి యుత్తర అమెరికాలో నివాస మేర్పరచుకొనిరి. కాని ఆంగ్లేయులు వచ్చినంతముంది రాలేదు. ముఖ్యముగ నుత్తర దేశమగు కనడా దేశములోని మంచి భాగములను పరాసు ( పెంచి, వా రాక్రమించిరి. కాని కావురముండుటకు తగిన మనుష్యులను పరాసు దేశమునుండి బంప లేదు. పట్టణములను విశేషముగ' నిర్మించ లేదు, కోటలను తగినన్ని కట్టలేదు. ఆ దేశములోని ఎర్రయిండియనులను తమక్రిందికి చేర్చుకొని యా దేశమంతయు తమదే యని మాత్రము చెప్పిరి. పరాను దేశముషండి యోగ్యులగు మత బోధగులును ప్రయాణికులును పచ్చిరిగాని తగినంతమంది పౌరులు రాలేదు, కనడాలో పరాసువారు లక్షమంది