పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

ఆమెరికాసంయుక్త రాష్ట్రములు


అమెరికా యొక్క ఉద్దేశ్యములు సుప్రసిద్ధముగు ఆ మెరికాస్వతంత్ర పకటనము నందు వ్యక్తీకరింపబడినవి. సంయుక్త రాష్ట్ర ప్రభుత్వమువారు. అదస్తావేజు యొక్క ఉద్దేశ్యములను సంయుక్త రాష్ట్ర ప్రజల విషయముంస్ నేగాక ప్రపంచములో ప్రతిచోటను వర్తింపచేయుచున్నారు.


ఈదృష్టినుంచి చూచినచో మేము (జపానీ యులము) ప్రజాపరిపాలనము యొక్క పద్దతి కై మీకై చూచు చున్నాము . ఆంగ్లేయ రాజ్యములో రాజున్నప్పటికీని ఆది ప్రజాపొలనకు గల దేశమే . కొన్ని వందల సంవత్సరముల నుండియు ఆంగ్లేయ రాజ్యముచే భరతవర్షము పాలింపబడుచున్నది. కాని ఇన్ని వందల సంవత్సరముల పాలసమునందు ఆంగ్లేయప్రభుత్వము వారు భరత వర్షమునందు చేసిన మంచి కార్యము అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రభు త్వమువారు ఫిలిప్పైన్ ద్వీపములలో తను పాలనముకింద సున్న పదకొండు సంవత్సరములలో చేసిన మహత్కార్యముతో ఏమాత్రము పోల్చుటకు వీలు లేని దైయున్నది. నిజమైన ప్రజా పాలనము యొక్క భావములను సంయుక్త రాష్ట్ర మువారు పూర్తిగా గ్రహించి " ఆచరణలో పెట్టుచున్నారని నేను గట్టిగా చెప్పుచున్నాను. " ఓంతత్సత్ -