పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

287

పదమూడవ అధ్యాయము


లగు స్త్రీల స్తితిని గూర్చి (Vice Commission) విచారించుట కేర్పడిన కమిటీవారు ఒక్క చికాగో పట్టణములో , వ్యాధివలనను మరణమువలనను వ్యభిచార మునకు అనర్హులగుచున్న వారి స్థానమునకు ప్రతిసాలున వ్యభిచార మునకు వచ్చుచున్న కొత్త స్త్రీల సంఖ్య అయిదు వేలనియు అందులోషుమారు సగము మంది పదునేడు సంవత్సరములలోపు వయస్సు బ్లిక లనియు తేలినదని వాసియున్నారు. ఇంత అమాయికలగు : బాలిక' లను వ్యభిచారదార్భాగ్యములో పడకుండ కాపాడటకై మార్గములను అన్వేషించవలెనని ప్రభుత్వము వారిని కోరియున్నారు. వివాహ విచ్ఛేదములుకూడ అమెరికా కోర్టులలో తరుచుగా జరుగుచుండును. నూటికి ఒకటి చొప్పున వివాహ ములు కోర్టు ద్వారా విచ్ఛేదమ గుచున్న వని లేఖల వలన తేలినది. రోమను కాధలిక్కు మతస్తులలో వివాహ విచ్చేనములు జరుగుటకు వీలులేదు. ఇటులనే కాలిఫోర్నియా రాష్ట్రము లోకూడ కోర్టులలో వివాహవిచ్చేదములు జరుపరు. అమెరికాలో ప్రతికాపఠనమెంత ఎక్కువగనున్నదో చూవుటకి కింది. నిదర్శనములు చాలును. (The Ladies Home Journal) స్త్రీల గృహపత్రిక అనుమాసపత్రిక కు పదునెనిమిది లక్షలమంది.స్త్రీ చందాదారులుగ నున్నారు. " The Woman's. Home Companion" శ్రీకి గృహమునందుతోడు, అనుమాసపత్రికకు పదునాలుగు లక్షల అరువది ఏడుమంది స్త్రీలుచూందాములుగ నున్నారు. అమెరికాలోగల ప్రధాప

దినపత్రిక లన్నిటికిని లక్షలకొలది చందాదారులు గలరు. పృతికలును లెక్క లేనన్ని గలవు.