పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

ఆమెరికా మరియుక్త రాష్ట్రములు

స్త్రీలు.

అమెరికాలో స్త్రీలకు పురుషులతో బాటు సంపూర్ణస్వతంత్రము గలదని చెప్పనక్కర లేదు. శ్రీ పురుషులతో బాటు స్త్రీలు కూడ విద్య నేర్చు కొనినారు. స్వతంత సంపాదనమునందును నీగ్రోబానిసత్వ నిర్మూలము నందున పురుషులతో పోటు స్త్రీలు పని చేసియు చున్నారు. ఇపుడు రాజకీయ సాంఘిక వ్యవహారములలో నేగాక దాదాపుగా అన్ని వృత్తులలోను స్త్రీలు ప్రవేశించుచు పురుషులకు పోటీగనున్నారు. ఆ రాష్ట్రములలో స్త్రీలకు ఓట్లుగలవు. స్త్రీలు శాసన సభ్యులు నున్నారు. ఉద్యోగములు చేయుచున్నారు. ఈ మధ్యనే ఒక స్త్రీ ఒక రాష్ట్ర ముసకు గవర్నరుగ నెన్నుకొనబడెను.


1910 వ సంత్సరపు జనాభాగణితీవలన ఆరులక్షల పందొమ్మిది వేల మంది ఉపాధ్యాయ వృత్తి స్వీకరించిన వారిలో నాలుగులక్షల ఎనుబది నాలుగు వేల మంది స్త్రీలు గలరు 1843 మంది స్త్రీ లాయర్లును (న్యాయవాదినులుము) 9015 మంది స్త్రీ డాక్టర్లును వైద్యులును) గల, సంగీత మును నేర్పు ఉపాధ్యాయినులుగా 81478 మంది యున్నారు. టైపు రైటిర్లు 288816 మందియు లెఖ వ్రాయువారు 187155 మందియున్నారు. ఇంత సాంఘిక స్వతంత్రముగల ఆచారము లేక్పడియుండి, ప్రతి యేటను కడు బీదలగు స్త్రీపురుషులు పది లక్షల మంది, యూరఫుసుండి వచ్చుచుండినప్పుడు మానవ స్వభావములోగల బలహీనతను 'అవకాశము తీసుకొనువారు కూడ సుండక పోవుదురా? పట్టణములలో నైతిక బలహీనత వలసను పేదరిక మువలనను వ్యభిచావృత్తికి లోబడుచున్న దార్భాగ్యు