పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము

13



దేరుట అసంభవమయ్యెను. కావున జర్మనీవారు ఆసియాలో గాని అమెరికాలోగాని తక్కినజాతులవలె రాజ్య సంపాదనము చేయలేదు.

{ఆప్రికాను
కనుగొనుట}

(3) అమెరిశాఖండముతో పాటు ఆఫ్రికా ఖండముకూడ యూరపియను జాతులచే కనుగొనబడెను. ఆఫ్రికాను ఖండములో ముఖ్యముగ భూమధ్యరేఖకు కనుగొనుట, (Equator) దక్షిణముననున్న భాగములో నాగరకజాతులు లేరు. వైశాల్యమునందు మితి లేనిదై యూర పుజాతులు నివసించుటకు యోగ్యమై, ధనాభివృద్ధి కుపయుక్తమై, యున్న నీప్రదేశమును కనుగొనుట గొప్పయదృష్టమని తెలజాతులవారు భావించిరి. తమదేశములలో జనసంఖ్య విశేషముగ వృద్ధి చెంది చాలమందికి కడుపునిండ తిండి దొరకని స్థితిలో సుండగ, ఇచ్చట గనులనుత్రవ్వి తోటలను వేసి భూములను సేద్యము చేయించుకొని త్వరితముగ ధనవంతులగుటకు మంచి యవళాశ మొదవెవని తలచిరి,

{యూరపియను
జాతుల మధ్య
పోరాటము}

కొత్త ప్రదేశములు కనుగొనబడినవి. అవి యోగ్యమయినవి, లాభకరమైనవి. కాని వాటిని నీతెల్లజాతుల మధ్య పంచి పెట్టు వారెవరు!అప్పటి?" మెసపొటేమియను ఆంగ్లేయులకును" పోరాటములు."సిరియాసు పరాసు వారికిని” “ధ్రేసునుగ్రీసు వారికిని" వంచి పెట్టు నానాజాతుల సమ్మేళనము పుట్టలేదు. కావున ధనార్జనముకొరకును రాజ్య సంపాదనముకొరకును యూరపు ఖండ ములోని వివిధ జాతులవారు పోటీగ బయలు దేరిరి. వీరిమధ్య '