పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

అమెరిశా సంయుక్త రాష్ట్రములు


చేరుటకును మనము నిర్మాణ కార్యమును బాగుగ జరిగించుకొన వలెను. ఇదివరకే అనేక సంఘములు పెట్టుకొనియున్నాము. ఇంకను వారిసంఘములు శాఖోపశాఖలుగ స్థాపించు కొనవలసి యున్నది. నిర్మాణ కార్యక్రమ మనగా ఆత్మ త్యాగము. అనేకులు తమ కాలమును, పనిని, లాభములను ద్రవ్యమును త్యాగము చేయవలసియున్నది. ఇంతకును అమూల్య మగు హక్కులును అనగా స్వతంత్రమును పొందుటకు మనమవలంబించు పద్దతి మిగుల చౌక అయినది. సల్ల వారియభివృద్ధికై ఏర్పడిన జాతీయ సంఘమును పోషించుచున్న ద్రవ్యములో విశేషభాగము నల్లవారినుండియే వచ్చుచున్నందునకు భగవం తునికి వందనములర్పించుచున్నాను. ఇంక నెక్కువగా దవ్య సహాయము చేయుటకు నల్లవారు నేర్చుకొనవలసియున్నారు. ఈ సంఘము యొక్క శాఖలింక ననేకములు పెట్టి మస ఆదర్శములను మన యుద్దేశ్యములను నెరవేర్చు కుందుముగాక."