పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పన్నెండవ అధ్యాయము

275



- వాడుమాతో పోటీవచ్చును గనుకను ద్రవ్యమును సంపాదిం చును కనుక వాడు పరిశ్రమలలో ప్రవేశించుటను మేము సహించము, వాడు స్వతంత్రుడై మా పక్కన కాపురముండును గనుక వానిని ఆస్తికొననియ్యము. వాడికూలిమాకు కావలసియున్నది గావున దానిని మేము విడిచి పెట్టము. వానిని దూరముగా ప్రత్యేక ప్రదేశములలో కాపురముంచెదము. వానికి రాజకీయ హక్కులిస్వము.”


" దక్షిణాదివారు మాత్రమే నిందకర్హులుగారు. మొదట నీగ్రోలకు విద్యాభివృద్ధిలో తోడ్పడి ఓట్లనిచ్చి ఆర్ధికముగా సహాయము చేసిన ఉత్త రాది వారు కూడ దీనినంతయు వదలి దక్షిణాది వారిలో చేరినారు. నీగ్రోల పాఠశాలలను పాడు చేసినాడు. కూలిని తగ్గించినారు. సాంఘికముగా వెలివేసి నారు, రాచకీయముగా మాల వానిగ చేసినారు. నీగ్రోలు చెమటకార్చి సంపాదించిన ఆస్తు లను అపహరించవలెనని కూడ ఇప్పుడు ప్రయత్నము చేయుచున్నారు. ”


"అపహరించుట కాక ఏమిటి ? నీగ్రోలందరును ప్రత్యేక ప్రదేశములలో 'కాపురముండవలెననియు వారు సేవ్యము చేసుకొను భూములు ఒకేవైపున ఒకే ఖుడముగా నుండవలెననియు చట్టములు చేయుటలో నీగ్రోల కిదివరకున్న మంచి ఆస్తులను తెల్లవారు అపహరించుటకాక మరేమున్నది ? ఎర్రయిండియసుల విషయములో తెల్లవారెంత లజ్జాకరఘుగా ప్రవర్తించిరో మనకు తెలియదా?


' మనము హక్కులు పొందుటకును మన గమ్యస్థానము