పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

అమెరికా సంయుక్త రాష్ట్రములు



విద్యయే కావలెననియు నీగ్రోలు సంతతము పట్టుదలతో ఆందోసము చేయవలెను. "

" ప్రతిదినమును అమెరికాలోనిగ్రోలు నీచత్వము నకును బాధలకును అన్యాయము లకును లోబర్చబడుచున్నారు. వారికి రాచకీయ, ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి అవకాశములు తీసి వేయబడినవి. మనము ఈపరిస్థితులలో పోరాడవలసి యున్నది. ప్రజాభిప్రాయమును మార్పుటకు మనము సంతతము కృషి సల్పవలెను. తెల్ల వారు మసతో సామాను లేగాని అధికలుగారని మాకు తెలియును. పోరాటములో మస ఆయుధము గొప్ప ఆదర్శములు కలిగియుండుటయే గాక నూతన పకృతి శాస్త్ర పద్దతులుకూడ ఆయ్యున్న వి” అని వారు చెప్పు చున్నారు.

నీగ్రోలు కోరు
హక్కులు.

డాక్టరు ద్యూబాయి నీగ్రోలకు మూడు బంధనములుతెగిపోవలెనని కోదుచున్నాడు (1) రాజకీయముగా తెల్లవారి వత్తిడి నుండి నీగ్రోలు విముక్తి కావలెను. నీగ్రోలకు ఓట్లు కావలెను. (2) నూతనముగా దేశము చెందుచున్న ఆర్థికాభి వృద్ధిలో నీగ్రోలకును భాగము రావలెను. (3) సాంఘికముగా నీగ్రోలు తెల్లవారితో సమానులుగ భావింపబడవలెను.


ఆయన యిటుల వాసినాడు:-----


"దక్షిణాదివారిటుల చెప్పుచున్నారు.- నీగ్రో నీచుడు గనుక వానిని నీచముగా మేము చూచెదము. వాడిని నీచత్వములోనుంచి పైకివచ్చుటకు మేము వప్పుకొనము, వాడు తెలివి నొందుటకు మాకిష్టము లేదు గావున వానికి చదువు చెప్పము.