పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

అమెరికా సంయుక్త రాష్ట్రములు


(4)

నీగ్రోల
స్థితి


అమరికా సంయుక్త రాష్ట్రముల జనసంఖ్య పదికోట్ల తొంబది అయిదు లక్షలు గలదు. వీరిలో ఒకకోటి పదిలక్షలు నీగ్రో లున్నారు. ఈ నీగ్రోలలో విద్య బాగుగా వ్యాపించినది. 'ఆనేకులు భాగ్యపంతులును గొప్ప విద్యావంతులును గలరు. నీగ్రో యగు డాక్టరు ద్యూబాయిగారికంటే గొప్ప గ్రంధకర్త అమెరికాలో పుట్టలేదు. బుకరు వాషింగ్డను కంటె మానవ సేవా ధురంధరుడు ఏదేశములోను పుట్టలేదు. ఇట్టివారినికన్నందుకు నీగ్రో జాతియే గాక ఏజాతియైనను గర్వపడదగియున్నది. అనేక మందినీగ్రోలు సర్వకళాశాలలలో ప్రతిసంవత్సరము చేరుచున్నారు. అనేక ముది నీగ్రోలలో తెల్లవారెరక్తము ప్రవహించుచున్నది. తెల్లపురుషులకు నీగో స్త్రీలకు పుట్టిన వారనేకమంది యున్నారు. నీగ్రోలలో అనేకులు తెల్లవారితోపాటు తెల్లగా నున్న వారున్నారు. అయినను నీగ్రో తమతో బాటు తెల్లవారు భోజనమునకు కూర్చొననివ్వరు. తమ పూటకూండ్లయిండ్ల లోను ప్రార్థనామందిరములలోను చేర్చుకొనరు. నీగ్రో కేవలము కారునలు పైనను మిగుల తెల్లగానున్నను ఒకేవిధముగ తెల్ల చారిచే బహిష్కరింప బడుచున్నాడు. స్వయం సహాయము కొరకును తమ అభివృద్దికొరరను నీగ్రో లనేక సంఘములు పెట్టుకొనియున్నారు. వారి తాలూకు ఒక్క క్రైసిసుపత్రికతకు ముప్పది వేలమంది నీగ్రో చందాదారు లున్నారు. దీని వలన నీగ్రో లెంత నాగరికులుగ నున్నారో తెలియగలదు. నీగ్రోలలో దావాపుగా అందురును క్రైస్తవులే. అయినను