పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ఆమెరికాసంయుక్త రాష్ట్రములు



ధనమును సంపాదించిరి. తమ కిందనున్న ఎర్రయిండియును బానిసలచేతను, ఆఫ్రికాఖండమునుండి పట్టుకొని వచ్చిన నల్ల నీగ్రోబానిసలచేతను, భూములలోను గనులలోను తోటల లోను పనిచేయించుకొనిరి. ఇటులనే 1580 వ సంవత్సరమున పై జరో అను నతని క్రింద స్పైన్ పొరు మరియొక దండయాత్ర సలిపి పెరూదేశము నాక్రమించిరి. అచటనుకూడ మెక్సికోలో వలెనే చంపగా మిగిలిన ఎర్రయిండియనులను బానిసలుగ చేసికొని గనులలోను తోటలలోను భూములలోను ' పనులు చేయించుకొనిరి. ఈ విధమున నే పోర్చుగీసువారుబ్రెజిలు దేశము నాక్రమించిరి, ఆచటి ఎయిండియనులను కూడ నిటులనే చేసిరి. స్పైన్, పోర్చుగలు ప్రభుత్వములక్రింద మెక్సికో, పెరూ, బ్రెజిలు దేశములు మూడును బానిసవ్యాపారమువకును ధనాభివృద్ధికిని మిగుల ఖ్యాతిని పొందెను. అమె రికాఖండము యొక్క బంగారు వెండి గనులీ రెండు జాతుల వారిని యూరపుఖండములో కెల్ల యైశ్వర్యవంతులను చేసెను. స్పైస్, పోర్చుగీసు దేశమువారి యైశ్వర్యాభివృద్ధిని చూచి హాలెండువారును, పరాసుపోరును, ఆంగ్లేయులును ధనసంపాదనకై సముద్రము లమీద బయలు దేరిరి. జర్మనీ దేశమపుడు ఆస్ట్రియా చక్రవర్తియగు స్పైన్ రాజు యొక్క పాలనమునం దుండుట వలన స్పెన్ వారికి పోటీగ తక్కిన యూరపుజాతు లతోపాటు నూతన దేశముల యాక్రమణకొరకు జర్శను దేశీయులు బయలు దేరజాలక పోయిరి. తమదేశములోని విదేశ ప్రభుత్వము కింద వత్తిడినొందుచున్న జర్మనులు తమ యజమా నులగు స్పైన్ వారితో పోటీగ ఖండాంతరములకు బయలు