పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

అమెరికా సంయుక్త రాష్ట్రములు



సంవత్సరములో 48 రాష్ట్ర ములలో 26 రాష్ట్రములవారు నీగ్రోలు తెల్లజారితో వివాహమాడరాదని శాసించిరి. అట్టివిహములు చెల్లవని శాసించుటయేగాక అట్టివివాహములు చేసు కొనిన వారికి శిక్షలువిధించు నట్లు చట్టములు చేసిరి. కొన్ని రాష్ట్రములలో 700, రూప్య ముల జుల్మానా మొదలు మరికొన్ని రాష్ట్రములలో పదిసంవత్సరముల ఖైదువరకును శిక్షలు నిర్నయించబడెను. ఇటులనే నీగ్రో పురుషులకును తెల్ల స్త్రీల కును వ్యభిచార సంబంధ మున్న చోటులగూడ నీగ్రో పురుషు లకు శిక్షలు విధించు చట్టములను చేసిరి.

నీగ్రోలు తెల్ల
వారెక్కు రైలు
డబ్బాలలో
ఎక్కగూడదు.


ఇంతేగాక దక్షణ రాష్ట్రములలో తెల్లవారెక్కు రైలు బండి డబ్బాలలో నల్లవారెక్కకుండ నిర్భంధములుచేసి నల్లవారెక్కుటకు "వేరుడబ్బాలు ఏర్పాటుచేయబడెను. కొన్ని రాష్ట్రములలో స్టీమరులలోను ట్రాంబండ్లలోసు కూడ 'తెల్లవారెక్కుటకు వేరు ప్రదేశములును నీగ్రోలెక్కుటకు వేరుప్రదేశములును ఏర్పాటు చేయబడెను. సాధారణముగ వేరు వేరు ట్రాంబండ్లు ఏర్పడియున్నవి. కానికొన్ని చోటుల ట్రాంబండ్లలో ముందుబల్ల లన్నియు తెల్లవారికిని వెనుక బల్లలు నల్ల వారికిని నిర్ణయించబడినవి. సాధారణముగా ఎంత భాగ్యవంతుడైనను నీగ్రో, బాటసారికి రైలుబండిలో నిద్రించుటకు స్థానమివ్వబడదు. కొన్ని రాష్ట్రముల లోనికి రైలురాగానే నిద్రించుట కేర్పడిన స్థానమును వదలి నీగ్రోబాటసారి మామూలుగా కూర్చొను స్థానము మునకువెళ్ళి తీరపలెను. ఒకేమొత్తమును పుచ్చుకొనియు అతి