పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పన్నెండవ అధ్యాయము

263



"జూతి, వర్ణ , వెనుక బానిసగా నుండుట, ఈకారణములలో దేనిచేతనుకూడ పౌరునికిని పౌరస్వత్యములు తీసి చేయుటకు వీలు లేదని సంయుక్త ప్రభుత్వము వారు చేసిన చట్టమువలన నీగ్రోలకు రాజకీయస్వత్వములు పోవుటకు వీలు లేదని కొందరు తలచ వచ్చును. కాని ఈనిబంధనను తప్పించుకొనుట అనేక మార్గములు తెల్లవారిచే పన్న బడినది. 1871 సంవత్స రఘు తరువాత బలవంతమువలననో ఘోసమువలననో దక్షిణ రాష్ట్రములలో నీగ్రోలకు రాజకీయ హక్కులు తీసివేయబడినవి. ప్రతి ఓటకునకు ఆస్తి విద్య యుండవలెనను నిబంధిన క్రింద విశేషసంఖ్యాకులగు నీగ్రోలకు ఓట్లు లేకుండ చేసిరి. ఇట్టి నిబంధనలక్రింది కేవచ్చు బీదలయినట్టియు విద్య లేనట్టియు తెల్ల వారికి , తాతలు గొప్పవారనియో" , తగినంత జ్ఞానముక కలదనియో' మినహాయింపులు చేసి ఓట్లు ఇవ్వబడును. ఈ నిబంధనలను వర్తింపచేయుటలో తెల్ల ఉద్యోగస్తులు తెల్ల ఓటర్లకుమిగుల తేలికగను సల్లఓటర్లకు మిగుల కఠినముగను వర్తింపచేయు చున్నారు. దీనికంతకు కారణము నీగ్రోలను ఎటులైన రాజకీయ రంగమునుండి వెళ్ళగొట్టవలెనని తెల్లవారికిగల ప్రబలముగు ఇచ్చయే....... ప్రస్తుతము దేశములో ప్రబలియున్న పరిస్తితులను బట్టి నీగ్రోలకు రాజకీయ హక్కులు ప్రసాదింపబడునని తలచుటకు వీలు లేదు.”

నీగ్రోలు
తెల్ల స్స్త్రీలను
వివాహమాడరాదు.

ఇంతటితో ఆగలేదు, నీగ్రోలకు ఓట్లు లేకుండ చేసి వారిని రాచకీయముగ నీచమగుస్తితిలో తెచ్చుట యేగాక వారివిషయములో సనేక పాక్షిక మగు చట్టములును చేయబడెను. 1910 వ-