పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

అమెరికా సంయుక్త రాష్ట్రములు


లోని నీగ్రోలు అధికారగర్వమువలన అక్కడక్కడ తెల్ల వారి నవమాస పరచుట తటస్థించెను. తెల్లవారు రహస్య సంఘములుగా నేర్పడి దుండగులుగా వర్తించిన నీ, గ్రోలను తామే క్రూర హింసలు గావించిరి.


ఈవిధముగా ఉత్తర రాష్ట్రముల కక్షివారికిని దక్షిణ రాష్ట్రములలోని ముఖ్యులగు తెల్ల వారికిని 1870 వ సంవత్సరము పరకును పోరాటములు కలిగెను. 1870 వ సంషత్సరమున నీగ్రోలను సంరక్షించుట కేర్పడిన ఉద్యోగీయుల ఉపసంఘము రద్దుపరచబడెను. " యుద్ధములో పాల్గొనిన తెల్ల వారిమీద సుపయోగించబడిన నిర్బంధములన్నియు తీసి వేయబడెను. ప్రభుత్వపు సైనికులను తీసి వేసిరి. నీగ్రోలకు చేయబడిన ప్రత్యేక సహాయమంతయు మాని వేసిరి.

(2)

నీగ్రోల హక్కులు
తీసివేయబడెను.

ఉత్తరాదివారును దక్షణాది వారుసు రాజీపడిరి. తెల్లవారందరును ఏక మైరి. దక్షిణరాష్ట్రముల లోని తెల్లవారికందరికిని వోట్లువచ్చెను. యుద్ధమమునకు పూర్వమువలెనే రాజ్యాంగ వ్యవహారములను, తెల్లవారు చెలాయించిరి. నీగ్రోలకు వోట్లను పౌరహక్కులును లేకుండా చేయు ప్రయత్నములు తిరిగి బాగుగాగా సాగెను. ఇప్పుడు బానిసత్వపుయుద్దమువకు పూర్వము లెనే దక్షణరాష్ట్రములోని నీగ్రోలు గాచకీయ " హక్కులు సంపూర్ణముగ కోల్పోయియున్నారు. నీగ్రోల ప్రస్తుతము రాచకీయ స్థితిని గూర్చి పాలు వేలండ హావర్తు అను అమరికను గంధకర్త.- .