పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పస్నెండవ అధ్యాయము

261



లగు జాతులని పరిగణించు శాసనములను చేసిరి. నీగ్రోలు మీద తలపన్ను విధించిరి. పన్ను ఇవ్వనిచో ఖయిదువేసిరి. తెల్ల వారికింద పనిచేయించి, కొంచెమించుగా వెనుకటి బానిసత్వపు స్తితికే నీగ్రో తేబడెను.


ఉత్తర రాష్ట్రములవారు దీనిని సహించ లేదు. యుద్దముయొక్క ఫలితములు నాశనమగుటకు సమ్మతించ లేదు. వీరి రిపబ్లికసు కక్షిలో దక్షిణ రాష్ట్రములలోని తోటల యజమానుల గాక సామాన్యలగు తెల్లవారు చాలామంది చేరిరి. కొంతకాలము రిపబ్లికను కక్షివారేసంయుక్త ప్రభుత్వమునందు ఎక్కుప సంఖ్యాకులుగనుండి దక్షణ రాష్ట్రముల వారిని ప్రతిఘటించిరి. సంయుక్త రాష్ట్రములలో నెచటను కూడ జాతివలనగాని, రంగుకారణమునగాని, లేక వెనుక బానిస గానుండిన కారణముచేతగా, ఎవరికిని పౌరస్వత్యములు పోగూడదని సంయుక్త రాష్ట్ర ప్రభుత్వము వారు సంయుక్త రాష్ట్ర రాజ్యాంగ విధానములో సవరణగావించిరి. సుయుక్త ప్రభుత్వము వారు దక్షణ రాష్ట్రములలో స్వేచ్ఛను పొందిన నీగ్రోల సంరక్షణకై యొక యుద్యోగుల యుప సంఘము నేర్పరచివి. ఇదివరకు బానిసత్వముస కాపాడుటకై యుద్ధములో పనిచేసిన వారందరును రాజ్యాంగములో పాల్గొనకుండ చట్టములను చేసిరి. దక్షిణరాష్ట్రములలో సంయుక్తప్రభుత్వము వారు సైనికుల నుంచిరి. నీగ్రోలకు పెద్దయుద్వోగములివ్వబడెను. వీరి శాసనసభ్యత్వముకూడ లభించెను తెల్ల వారునూటికి ఎనుబది చొప్పున పన్నులిచ్చుచున్న ప్పటికిని చాలచోటుల నీగ్రోలే పన్నులువేయునధీ కారమును పొందిరి.