పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము

11


.. .

\లలో కొంతమంది కిష్టము లేదని ఈతనికి తెలిసెను. మెక్సికో ప్రజలను తమ స్వదేశరాజు యొక్క దుర్మార్గము నుండి రక్షించుటకు వచ్చినటుల స్పైన్ వారు నటించసాగిరి. కొంద రె యిండియను ప్రజలు నమ్మి స్పైన్  వారితో చేరిరి. స్పైన్ వారు. ఎర్రయిండియనులచే స్వదేశ రాజు పై తిరుగబాటులు చేయించిరి. 1510 వ సంవత్సరము న స్పైన్ వారు మెక్సికోలోని పల్లపు భూములలో ప్రవేశించి తిరుగ బాటు దారులకును రాజుకుసు మధ్యవర్తులుగ సున్నటుల నటించి రాజుతో రాయ బారములు సలుపసాగిరి. రాజు స్పెఁన్ వారితో స్నేహము నొంద యత్నించుచుండెను. మరికొందరు ప్రజలకు తమరాజు, విదేశీయులగు స్పెయిన్ వారితో స్నేహముగనుందుటకిష్టము లేక. రాజుపై తిరుగబడి రాజును చంపి వేసి స్పెయిన్ వారిని ముట్టడించి కొందరిని హతులను గావించిరి. . కోరేజీ సముద్ర తీరమునకు పారిపోయెను. తరువాత కొత్త సేనలు స్పెయిన్ దేశమునుండివచ్చి కొంతకాలము పోరాటమునలిపి మెక్సికో చేశమునంతను ఆక్రమించుకొని స్వాధీనమును పొందిరి. స్పెయిన్ వారు మెక్సికో దేశమున రాజ్యమును స్థాపించుకొనిరి. స్పెయిన్ వారు కొంద రెర్రయిండియనులను చంపిరి. మిగిలిన వారిని బానిసలుగ చేసికొనిరి. వారిని రోమనుకాథలిక్కు లో క్రైస్తవమతమును స్వీకరింప జేసిరి. వారీస్వభాషను నిర్మూలనముచేసి వారికి 'స్పెయినుభాష నేర్పిక. బానిసలకు స్వభాష. స్వధర్మము లుండనేరవు. అనేక మంది గుంపులు గుంపులుగ స్పెయిన్ దేశమునండి వచ్చి మెక్సికో దేశమున నివసించిరి. . అచట గనులను త్రవ్వించుకొనియు తోటలను వేసియు చాల