పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

అమెరికా సంయుక్త రాష్ట్రములు


సంవత్సము జనవరిజల 31 వ తేదీన నే బానిసత్వము విషయములో అమెరికా సంయుక్త రాష్ట్రముల చట్టం సవరణ గావింపబడెను. " ఇతటినుంచియు అమెరికా సంయుక్త రాష్ట్రములలో గాని వాటి క్రిందనున్న ప్రదేశములలో గాని బానిసత్వముగాని నిర్బింధమగు నౌకరీగాని యుండవు." అని శాసింపబడెను. తిరుగబాటు చేసిన దక్షిణ రాష్ట్రముల లోనివారిని క్షమించి నిజమైన స్నేహభావమును శాంతమును అన్ని రాష్ట్రముల మధ్యను నెలకొల్పుటకు అబ్రహాంలింకను యత్నించుచుండెను. ఇంతలో ఏప్రిల్ నెల 14 వ తేదీ రాతి) నాటకశాలనుంచి వచ్చుచుండగా ఆబ్రహాం లింకమను బానిసత్వ పక్షపు కుట్రలో చేరిన యొక దుష్టుడు' తుపాకితో కాల్సి చంపెను. మానవ స్వాతంత్ర్యమునకై ప్రాణము లర్పించిన యుత్తమ పురుషులలో ఆబ్రహాం. లింకను పేరెన్నిక గన్న వాడు.