పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదకొండవ ఆధ్యాయము

257



యున్నది. కాని ఈ స్తలమును పవిత్రవంతముయిన దానినిగా మనము చేయజాలము. ఇచట పోరు సలిపిన ధీరులు - మరణించినవారును బ్రతికి యున్న వారును -- దీనిని పవిత్ర పరచి యున్నారు. మనము అల్పులము. మసుమేమి చెప్పినను దానిని ప్రపంచము లక్ష్యము చేయదు. వారు చేసిన దానిని శాశ్వతముగా గ్యాపక ముంచుకొనును. బ్రతికియున్న వార మైన మనయొక్క విధి యొక్కటే మనమును వారితోవసు సడచి మీరు చేసిన మహాత్కార్యమును పూర్తిచేసి పవిత్రవంతులవలు కావలసి యున్నాము. ఈ చనిపోయినవారు వృథాగా తమ ప్రాణముల సర్పణ చేయ లేదని మనమివుడు తీర్మానించవలసి యున్నది. పరమేశ్వరుని అనుగ్రహమువలన ఈజాతి స్వతంత్రయుతమగు పునార్జన్మను పొంది తీరునని మనమిపుడు దృఢ దీక్షతో నిచ్చయింతము. ప్రజల లాభముకొరకు ప్రజలచే చేయబడెడి ప్రజా పరిపాలనము భూమి మీద నుండి నాశనము చేయబడ జాలదని మనము త్రికరణ శుద్దిగా ప్రకటింతము." అని ఆయన చెప్పెను. 1866 వ సంవత్సరము మార్చినెలలో నూతన సంయుక్త ప్రభుత్వ సేనలు విచ్ఛిన్నమై పోయెను. మార్చి 29వ తేదీన వారి రాజధానియగు పీటర్సు బర్గులో సంయుక్త రాష్ట్రముల సేనలు జొరబడి స్వాధీనమును పొందెను. ఏప్రియల్ 7 వ తేదీన వారి సేనాధిపతులు సంయుక్త రాష్ట్రములకు లొంగి ఇబ్రహాం లింగసుచే క్షమించ బడిరి. యుద్ధము ముగిసెను. అమెరికా సంయుక్త రాష్ట్ర ముల ఐక్యత కాపాడబడెను. అమెరికా సంయుక్త రాష్ట్రములలో బానిసత్వము సంపూర్ణముగ రద్దుపర్చబడెను. 1865 వ