పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

అమెరికా సంయుక్త రాష్ట్రములు


వయన్నియు అమర్చుకోబడెను. ప్రతి వానికిని బానిసలను ఆస్తిగా నుంచుకొను హక్కు గలదని శాసించబడెను


యుద్ధము

(కాంగ్రెను), శాసనసభలు ఎన్నికలకై అభ్యర్థులుప్రయత్నము చేయుచున్నప్పుడే, ఎక్కువ మంది బానిసత్వమునకు వ్యతిరేకు లగువారు ఎన్నుకొనబడివచో తాము విడిపోదుమని దక్షిణ రాష్ట్రములలో చాలమంది బెదరించుచుండిరి. కాని నిజముగా రాష్ట్రములు విడిపోవునని ఉత్తరముననున్న ప్రముఖులు తలచలేదు. దక్షణ కారొలీనా బెదిరించినను బుజ్జగించగనే తిరిగివచ్చి చేరు " సనిమాత్రమే తలచిరి. ఇన్ని రాష్ట్రము లొకటిగా చేరునని తిలచ లేదు, బానిసత్వం కూడదను వారు తమయభిప్రాయ ములను దక్షిణ రాష్ట్రములమీద బలవంతముగా అంట కట్టుట సరికాదని శాసనసభలోని యొక కక్షివారు వాదించ సాగిరి. మూడు నెలలకాలము కాంగ్రెసువారు రాజీనామా "మయత్నములలో నిమగ్నులై యుండిరి. కాని రాజీనామా కుదర లేదు. తమను శాంతముగా విడిపోనిచ్చెదరనియు శాం గౌసువారుగానీ, కొత్తలధ్యక్షుడుగాని తమజోలికి రారనియు దక్షణాదివారు తలచిరి, మార్చి 4 వ తేదీన ఆబ్రహాము లింకను (ప్రెసిడెంటు) అధ్యక్ష పదవిని స్వీకరించెను. కాని 'సల యజమానులగు తెల్లవారు ఆయనను హత్య చేయుదురనియు అధ్యక్ష పదవిని స్వీకరించ సివ్వరనియు వదంతులు ప్రబలెను గాని అట్టిది సంభవించ లేదు. ఆయన ప్రధమము నుంచియు " బానిసత్వము అక్రమమైనదనియు, సగము స్వేచ్చా వంతముగను నగము బానిషత్వములోను ప్రభుత్వము శాశ్వ