పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు


స్పై౯ వారు వెళ్ళునప్పటికి అమెరికాలోని పశ్చిము మెక్సికో, పెరూ యిండియా ద్వీపములలో తామ్రవర్లముగల మోటవారు నివసించుచుండిరి. వారిని స్పెన్ వారు చంపిరి, దోచుకొనిరి, చంపగ మిగిలిన . వారిని బానిసలుగ పట్టుకొనిరి, బానిసలుగ పట్టుకొనిన వారిని క్రైస్తవులుగ

 మెక్సికో పెరూ
లోని ఎర్ర
ఇండియను
రాజ్యముల
నాశనము

చేసిరి.. క్రైస్తవులుగ చేయబడినను బానిసత్వమునుండి విముక్తి కాలేదు. నల్లవారు తమక్రింద బానిసలుగ నుందుట సహజధర్మమని తెల్లవారు నమ్మిరి. అమెరికా ఖండములోనికి సైన్ వారు జొరబడిన కొలదియు కొంతవరకు నాగరికతను చెందిన ఎర్రయిండియను లగుపడిరి. మెక్సికో, పెరూ దేశములలో మిగుల నాగరీకు లగు ఎయిండియనులు గొప్పరాజ్యములు స్థాపించుకొని నివసించుచుండిరి. వీరు ఆసియా ఖండముయొక్క గాని యూరపు ఖండము యొక్క గాని నాగరికతలకు సంబంధము లేని స్వతంత్ర మగు నాగరికతను నిర్మాణము గావించుకొనియుండిరి. ఈ జాతులను కూడ స్పైన్ వారు ముట్టడించిరి. . కోర్టేజి " యను స్పెన్ వాడు పదకొండు పడవలలో నాలుగువందల మంది స్పైన్ "సైనికులను రెండువందలమంది ఎర్రయిండియను సైనికులను పదునాలుగు ఫిరంగులను వెంట గొని మెక్సికో దేశము పై దండయాత్ర సలిపెను. ఆదిపరకే అచటికి వచ్చి ఎరయిండి యములచే ఖయిదుచేయబడి ఎర్రయిండియనుల భాషను బాగు గా నేర్చుకొనియున్న స్పైన్ వాదొక డీతని కలసెను. వాని వలన నాకాలమున మెక్సికో రాజునందు ఎరయిండియను ప్రజ