పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248


చేయబడెన. అనేక పాఠళలలును కొన్ని కళాశాలలుసు కూడ స్థాపించబడెను. అమెరిక సులు మిగుల ఉదార హృదయులై విశేషమగు ధనసహాయము చేసిరి. దక్షిణ రాష్ట్ర ములనుండి బానిసలగు నీగ్రోలను దొంగతనముగ ఉత్తర రాష్ట్రములకు తెచ్చి యిచట స్వేచ్ఛ నిచ్చుటకు గొప్ప యేర్పాటులు చేయబడెను. బానిస యిచట అడుగు పెట్టిన తోడనే స్వేచ్చము పొందును. పారిపోయి వచ్చిన వారిని తిరిగి యజమానులు పట్టుకొని పోవుటకు వీలు లేకుండ శాసనములను చేసిరి. 1860 వ సంవత్సరము వాటికి ఉత్తర రాష్ట్రములలో నాలుగు లక్షల మంది స్వేచ్ఛను పొందిన నీగోలుండిరి. నీగ్రో లను విముక్తి చేయుట కేర్పడిన సంఘములవారు దక్షిణరాష్ట్రములనుండి బానిసలను బహువిధములగు పాద్దతులచే యెత్తుకొని వచ్చిరి. ఒక్కొకప్పుడు వర్తక సరుకులతో పాటు బానిసలను పెట్టలలో పెట్టి రైళ్ళమీదను స్టీమరులమీదను పంపిరి. ఇచట చేరగానే పెట్టెలను మిగుల ఆత్రతతో తెరచి లోపలి వారిని బయటకు తీయచుండిరి. 1857 వ సంవత్సరమున నొక నీగోయువతిని బాల్టిమోరునుండి ఒక సామాను పెట్టెలో పెట్టి ఫిలడల్పియాకు వడవమీద రవానా చేసిరి. ఈ పెట్ట తోవలో ఒకటి రెండుసార్లు తలక్రిందు చేయబడెను . ఫిలడల్ఫియా చేరినతరువాత ఒక రాత్రియంతయు నాపెట్టె తెరువబడ లేదు, మరువాడుదయము పది గంటల వరకును ఆపెట్టెలో పిల్లయున్నటుల తెలియదు. అపుడు తెరచి లోపలనుండిన యా యువతిని బయటకు తీరుగా ఆమె స్పృహతప్పి యుండెను. కొంత వైద్య చికిత్స చేసిన