పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

247

పదకొండవ ఆధ్యాయము


వారికి యెక్కువ పలుకుబడి యుండెను. బానిసత్వము పోవునను భీతివలస కూడ దక్షిణ రాష్ట్రముల ప్రతినిధు లందరును యేకమై ఒక టేవిధమున సమ్మతుల నిచ్చుచుండిరి. దక్షిణ రాష్ట్రముల ప్రతినిధులమాట యెక్కువ చెల్లుబడి యగుచుం డెను. 1881 వ సంవత్సరమున యూరపు ఖండమున రైలు యంత్రము కనిపెట్టబడి మొదటి రైలువే (ధూమ శకటము) 'వేయబడెను. 1835 వ సంవత్సరమున తంతివార్త (టెలిగ్రాఫు) యూరపు ఖండమున ప్రధమమున కనిపెట్టబడినది. 1819 వ సంవత్సరముననే మొదటి పొగయోడ (స్టీమురు) అమెరికా నుండి బయలు దేరను. 1840 న సంవత్సర ప్రాంతముల రైలు వేలు (ధూమ శకటముల) విశేషముగ వేయ బడియు యంత్రశాలలు స్థాపించబడియు అమెరికాలోని ఉత్తర రాష్ట్రము లలో నైక్యతకును విశేషముగు సంపదకును కారణ మయ్యెను. ఉత్తర రాష్ట్రములు దక్షణ రాష్ట్రములలో పోటీ బడుటకను మించుటకును సర్వవిధముల తగియుండిరి. బానిసత్వమును అమెరికా సంయుక్త రాష్ట్రము. అన్నిటిలోను సంపూముగ గద్దు పరచవ లెసను కక్షి యొకటి ఉత్తరమున బయలు దేరెను.


మానవులను బానిసలుగ చేయుట యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిద్దాంతములకువ్యతి రేకమని ఆందోళసము చేయబడినది. కాని సత్వమును రూపుమాపుటకై సంఘములు స్థాపించబడెను. తెల్లవారగు అమెరికనులును స్వచ్చను పొందిన బానిసలును ఇందు సభ్యులుగా చేరిది. నీగ్రోలలో విద్యా వ్యాపకము H