పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

అమెరికాసంయుక్త రాష్ట్రములు


తెచ్చుకొనుచుండిరి. 1789 వ సంవత్సరమున పదమూడు సంయుక్త రాష్ట్రములకును రాజ్యాంగవిధానము, వాసికొని నవుడు బానిసత్వము అశాస్త్రీయమని దానిలో వ్రాయవలె పనియే కొందరు ప్రముఖులుద్దేశించిరి. కాని దక్షిణరాష్ట్రములు చీలిపోవునని భయమువలన బానిసత్వమును గూర్చిన ప్రస్తావనను పూర్తిగా విడిచి పెట్టిరి. అందువలన ప్రతిరాష్ట్రమును బానివత్వము విషయమున తన ఇచ్చవచ్చినటుల ప్రవర్తించెను. ఉత్త రాష్ట్రములు పరిశ్రమల కాకరములు.. బానిసలను తెచ్చినచో సామాన్యులగు తెల్ల వారికి జీవనములో, పోటీ ఏర్పడును. సొమ్ముపుచ్చుకొను కార్మికులు పనిచేసినటుల ఊరికె నిర్బంధముగ పనిచేయు బానిసలు పని చెయ్యరు. అందువలన క్రమముగా ఉత్తర రాష్ట్రములన్నియు బానిసత్వమువకు విముఖులై బానిసత్వ మశాశ్రియమని శాసించెను. దక్షిణరాష్ట్రములు వ్యవసాయమున కునికి పట్టులు. విశేమగుభూములుగల గొప్ప తెల్లభూఖామందులతో నిండియుండెను. వీరు బానిసలచే వ్యవసాయము చేయించుకొసరి. బానిసత్వము న్యాయమైనదని అంగీకరించిరి.


బానిసత్యమును
రూపుమాప వలెనను
ఆందోళనము.


పందొమ్మిదవ శతాబ్దములో యూరపు ఖండమునబానిసత్యమును రూపు మాపపలెనను గొప్ప ఆందోళసము బయలు దేరెను. ఈ ఆందోళనము అమెరికాకును వ్యాపించెను. పారంభములో చాలా సంవత్సరముల వరకు సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వములో దక్షిణ రాష్ట్రముల