పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

245

పదకొండవ అధ్యాయము


ఫ్రెంచివారైనను జర్మనులైనను ఐర్లాండు దేశీయులైనను అందరును అమెరికనులైరి. వీరందరి హృదయములలోను తమ మాతృదేశమగు అమెరికా సంయుక్త రాష్ట్రములయందు సంపూర్ణ మగుదేశాభిమానమును అమెరికా పొందుచున్న అత్యాశ్చర్యకరమగు ఐశ్వర్యాభివృద్ధియందు స్వభావమగు గర్వమును ప్రజ్వ రిల్లుచుండెను. స్వతంత్ర యుద్ధము నాటికి పదమూడు రాష్ట్రములుండెను. 1860 వ సంవత్సరమునాటికి ముప్పది మూడు రాష్ట్రము లేర్పడెను. మరియు మూడుకోట్ల పదిలక్షల ప్రజలుండిరి.


బానిసత్యము
గూర్చి బేదాభి
ప్రాయములు.


కాని ఉత్తర రాష్ట్రములవారికిని దక్షిణ రాష్ట్రముల వారిని బానిసత్వమును గూర్చిన భేదాభిప్రాయములు దివదినమునకు వృద్ధియై తీవ్ర రూపము దాల్చుచుండెను. ఉతరరాష్ట్రములో తెల్లవారే స్వయముగా పరిశ్రమలు వర్తక వ్యాపారములు వ్యవసాయము మొదలగు పనులన్నియు చేసుకొనిరి. తామాక్రమించిన ప్రదేశములలోని ఎర్రయిండి యనులు దొరికినచో నాశనము చేయుటయా లేదా తరిమి వేయుటయు మాత్రమే చేసిరి. కాని బానిసలుగా చేసికొనలేదు. క్రమముగా తమక్రిందనున్న నీగ్రో బానిసల కందరకును వ్యవసాయము నిమిత్తమును తోటలు వేయు నిమిత్తమును ఆఫ్రికాఖండము నుండి నీగ్రోలను బానిసలుగ దిగుమతి చేసికొనిరి. వేలకు వేల బానిసలను ప్రతిసంవత్సరమును