పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమిద్మత అధ్యాయము

219



చును. దాదాపుగా అన్ని రాష్ట్రములలోను శాసనసభలు న్యాయాధిపతులను ఉద్యోగము లోనుండి తీసి వేయవచ్చును. కొన్ని రాష్ట్రములలో న్యాయాధిపతులు రెండు సంవత్సర ముల కాలము వరకును కొన్ని రాష్ట్రములలో ఇంక నెక్కువ కాలము వరకును తక్కి నవానిలో న్యాయాధిపతులు సత్ప్రవర్తన గలిగి, పనిచేయు సంతకాలము వరకును యెస్నుకొన బడుచున్నారు. ప్రతి రాష్ట్రములోను సుప్రీంకోర్టు (ఉన్నత న్యాయస్థానము) సు దాని కింద శివిలు క్రిమినలు చట్టములు, ప్రకారము విచారణచేయు అన్ని కోర్టులును గలవు. కక్షి దారు ఏ ప్రత్యేక రాష్ట్రమునకు చెందనివాడై యున్నప్పుడును దావాలో సంయుక్త ప్రభుత్వ శాసన విషయములకు - సంబంధమున్న ప్పుడును మాత్రము రాష్ట్రీయ యున్నత న్యాయస్థానము నుండి సంయుక్త యున్నత న్యాయ స్థానమునకు అప్పీలు (విమర్శనాధికారము) గలను. తక్కిన అన్ని విషయములలోను రాష్ట్రీయ యున్నత న్యాయస్థానపు తీర్పు ఆఖరు తీర్పు అగును. అందు పైన విమర్శించు అధికార మెవరికిని లేదు.


స్థానిక
స్వపరిపాలనము.


అమెరికాలో స్టోనిక స్వపరిపాలనము ప్రధానమైనది. స్థానిక సంఘములకు చాల అధికారములు గలవు. ముఖ్యముగా పోలీసు, పారిశుధ్యము బీదల సంరక్షణ, పాఠశాలలు, రోడ్లు, వంతేలు, వర్తక వ్యాపారములకు లైసెన్సు (అనుమతి) నిచ్చుట, స్థానిక పన్నులు విధించుట, వసూలు చేయుట, సామాన్య క్రిమినలు నేరములను, సివిలు దావాలను విచారించుట, జైళ్ల