పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ అధ్యాయము

7



లతో అట్లాంటికు సముద్రయాసముచేసెను. అనౌకలలో నొక దానికి మాత్రమే పైకప్పుగలదు. తక్కిన రెంటికిని వైకప్పుకూడ లేదు. ఆయన తనతో కూడ ఎనుబది ఎనిమిది మంది మనుష్యులను తీసుకొని బయలు వెడలెను. రెండు నెలల తొమ్మివి రోజులు నడినముద్రములో ఒకేవైపుగా ప్రయాణము చేసెను. ఈ లోపున ఆయనతోనున్న వారికి విసుగు పుట్టెను. కొంత కాలమునకు నిరాశ జనించెను. ఎప్పటికిని సముద్రము మీద నిటులనే ప్రయాణము చేయవలెనేమోయను భీతి కలిగెను. తుదకు పక్షులు కనపడెను. ఆశకొంత వరకు కలిగెను. 1492వ సంవత్సరము అక్టోబరు 11వ తేదీన రాత్రి పదిగంటల కొక దీపమును చూచిరి. మరునాడుదయమున భూమికనబడెను... ఆయుదయముననే స్పైన్ దేశపు పతాకములతో నూతన ప్రపంచములో కొలంబసు దిగెను. అదేశములో మోటజాతులు నివసించి యుండిరి. ఆదేశములో నవుడు హిందూ దేశమును (ఇండియాను) పాలించుచున్నటుల తాను వినిన రాజు పాలించుట లేదు. ఆదేశము తాను వినిన ఇండియా (హిందూదేశము') వలెలేదు. దానిలో ప్రవేశించి యంతయు పరికించి చూచెను. అవి ద్వీపములు. వాటికి పశ్చిమ ఇండియా ద్వీపములని నామకరణము చేసెను. కొంతబంగార మును, ప్రతి ని, క్రొత్తకపు జంతువులను, పక్షులను, ఇద్దరు ఎర్రఇండియనులను తీసుకొని ఆయన తిరిగి 1498 వ సంవ త్సరమున యూరపు ఖండమును చేరెను. మరల నా సంవత్సర ముననే క్రైస్తవమత ప్రధానాచార్యుడగు పోపు యొక్క అనుజ్ఞనుపొంది పదునేడు పడవలతోడను పదిహేను వందల