పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

అమరిగా ఉంయుక్త రాష్ట్రములు


పుచ్చుకొనుట, మొదలగుగొప్ప నేరములు చేసినపుడు మాత్రము ప్రజాప్రతినిధిసభవారు తీర్మానము చేసి శిష్టసభ యెదుట ప్రధానేరముమోపెదరు. శిష్టసభవారు సంయుక్త రాష్ట్రముల నన్యాయాధిపతి యొక్క అధ్యక్షతక్రింద విచారణసలిపి మూడింట రెండువంతులమంది యొక్క సమ్మతులందుకు వచ్చినచో నేరస్తులగునారిని యద్యోగములనుండి తీసి వేయుదురు. ఎన్నటికిని అట్లయుద్యోగములు - చేయకూడదని శాసించు పచ్చును. మరియు న్యాయస్థానములలో నేరారోళణ చేసి శిక్షింపజేయవచ్చును. అమోకా సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము కింద వాషింగ్ట సుపట్టణము మాత్రము గలదు. తక్కిన యావత్తు ప్రదేశమును ఏవో రాష్ట్రము క్రింద నుండును. వాషింగను పట్టణము మీదను సంయుక్త ప్రభుత్వమునకు చెందిన ఆయుధాగారములు నౌకానిర్మాణ శాలలు మొదలగు ప్రదేశ ములమీదను సర్వాధికారము సంయుక్త ప్రభుత్వమున కేగలదు. వాషింగ్టను పట్టణములోని (White House) స్వేతమందిరము అను గొప్ప నగరునందు అధ్యక్షుకు నివసించును. సంయుక్త రాష్ట్రముల గౌరవమునకు మర్యాదలకు చిహ్న మైనవాడు అధ్యక్షుడు. ఆయనకు నెలకు ఇరువది అయిదు వేల రూప్యములు జీతము నిచ్చెదరు. ఇంకను ఖర్చులన్నియు ప్రభుత్వ బొక్క సమునుండి భరించెదరు. ఏదేశ రాజులను మంత్రులను ఆధ్యక్షుడు తనమందిరమున గొప్పదర్జాగా ఆదరించును. న్యాయస్థానములలో శిక్షింపబడిన నేరస్తులకు క్షమాపణనిచ్చుటకు అధ్యక్షునికే అధికారముగలదు.