పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ అధ్యాయము

213



'ఆపదవి వహించును. అధ్వడుకును ఉపాధ్యక్షుడును ఇద్దరును లేనప్పుడు మంత్రులలో నుంచి యొకరిని అధ్యక్షుని హోదాను చలాయించుటకు శిషసభవా రెన్ను కొనెదరు.


సంయుక్త రాష్ట్రముల సేనలకును నౌకొదళమునకును అధ్యక్షుడే సర్వసేనాధిపతియై యున్నాడు. ఈయన శిష్టసభ వారి సలహాతో మంత్రులను న్యాయాధిపతులను ఏదేశ రాయ బారులను పెద్దయుద్యోగస్తులను నియమించును. చిన్న యుద్యోగస్తులను శిష్టసభవారి సలహా లేకుండనే నియమించే వచ్చును. మంత్రులు అధ్యక్షునకు జవాబు దారులుగాని శాసన సభలకు జవాబుదారులుగారు. శాసనసభలలో మంత్రులు సభ్యులుగారు. మంత్రులు తొమ్మిదిమంది విదేశ వ్యవహారముల మంత్రి, ఆర్థికమంత్రి, యుద్దమంత్రి, నాకాదళమంత్రి, అంతర్వ్యవహార మంత్రి, న్యాయశాఖమంత్రి, పోస్టు(ట్రపా), మంత్రి, వ్యవసాయమంమంత్రి.వర్తకఫుమంత్రి, అనువారు. అన్ని చట్ట ములను క్రమముగా అమలుజరుపు విధి అధ్యక్షునియందున్నది. ఏదేశముతో నైనను అధ్యక్షుడు సంధి చేసుకొనిన యెడల దానిని శిష్టసభలోని మూడింట రెండువంతులమంది అంగీకరించ వలసియుండును.. శాసనసభలలో తాము పెట్టిన ముఖ్యమగు చట్టములోడిపోయినను సాధారణ విశ్వాన రాహిత్య తీర్మానమువలనను అధ్యడును ఉపాధ్యక్షుడు మంత్రి వర్గము రాజీనామా నివ్వనక్కర లేదు. ఎందువల్లననగా వీరి నెవరిని శాసనసభలు ఎన్నుకొన లేదు. వీరెవరును శాసనసభ లలో సభ్యులుగారు. అధ్యక్షుడు ఉపాధ్యక్షుడుగానీ ముంత్రులు మొదలగు పెద్ద యుద్యోగస్తులుగాని దేశద్రోహము, లంచము