పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

అమెరికా సంయుక్తరాష్ట్రములు



యూరపులో నెవరికిని తెలియదు. మార్కొపోలో యను నతని ప్రయాణములవలన ఆసియాఖండము మిగుల గొప్పదని తెలియును. కొలంబసునకు భూమి గుండ్రముగ నున్నదని తెలియును. కావున తాను పడమరగా అట్లాంటికు మహాసముద్రములో పోయినచో ఆసియాఖండమును జేరితీరెదనని తలచెను. అనేకసార్లు అట్లాంటికు సముద్రములో కొంతవరకు ప్రయాణముచేసి తిరిగి వచ్చుచుండెను. ఒక సారి ఐస్ లాండు ద్వీపమునుచేరి తిరిగివచ్చెను. ఇతనివద్ద దూరప్రయాణము చేయుటకు ద్రవ్యము లేదు. పోర్చుగీసు రాజగు రెండవ జూనుతో నీతడు తాను చేయదలచిన కార్యమునుగూర్చి మనవిచేసి ద్రవ్యసహాయమును గోరెను. ఆయన నీతనిని లక్ష్యముచేయక తానే స్వయముగా నౌకలను బంపెను. కాని దానివలన ప్రయోజనము కలుగలేదు. అప్పుడు కొలంబసు స్పైన్ దేశపు రాజునాశ్రయించెను. ఆసమయమనే స్పెనువారు మహమ్మదీయులతో పోరుసలుపుచుండిరి. స్పెన్ దేశీయులు తమదేశ ములో సారనన్ ముసల్మానుల యధీనమందున్న ప్రదేశమును తిరిగి స్వాధీనమును పొందుటకు యుద్ధము చేయుచుండిరి. కావున 'స్పైన్ వారివలన కొలంబసుకు సహాయముగాలేదు. అంత కొలంబసు తనతమ్ముని ఇంగ్లాండు దేశమును పాలించుచున్న హెన్రీరాజు వద్దకు బంపెను, కాని అచటనుండియు సహాయము రాలేదు. 1492 వ సంవత్సరమున స్పెన్ వారు ముసల్మానుల నోడించి తమదేశమునుండి వెడలగొట్టిరి. అప్పుడు స్పైన్ రాజు యొక్కయు కొందరు స్పైన్ దేశీయులగువర్త కుల యొక్కయు సహాయమువలన, కొలంబసు మూడు నౌక